స్వయంవరం, చిరునవ్వు, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు హీరో తొట్టెంపూడి (Venu Thottempudi). ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన వేణు గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చాలా కాలం తర్వాత రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన వేణు ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో వేణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ మురళి పాత్రలో నటిస్తుండగా.. మాస్ మాహారాజా రవితేజ హీరోగా నటిస్తున్నారు. డైరెక్టర్ శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆలీతో సరదాగా షోలో పాల్గోన్న వేణు తన కెరీర్.. వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. నీ సినిమా ఆడితేనే నా మేనల్లుడివి అని చెప్పుకుంటా. లేదంటే చెప్పను అని తన మావయ్య మచిలీపట్నం మాజీ ఎంపీ మాగంటి అంకినీడు అనేవారని చెప్పుకొచ్చారు వేణు..
వేణు మాట్లాడుతూ.. ” నా ఎత్తు 6.3 అడుగులు. చాలా మంది ఆలీతో సరదాగా షోకి వెళ్తున్నారు.. నువ్వెప్పుడు వెళ్తావ్ అని మా అమ్మ అడిగేది. ఇంట్లో అబద్ధం చెప్పి సినిమాలకు వెళ్లి మా నాన్నకు దొరికిపోయేవాడిని. దీంతో నాన్న నన్నుకొట్టేవారు. మొదటి డైరెక్టర్ భారతీరాజా దర్శకత్వంలో అరంగేట్రం చేయాల్సింది. కానీ ఆ అవకాశం మిస్ అయ్యింది. పూరి జగన్నాథ్ కలిసి దేశముదురు కథ వినిపించారు. అన్నీ చేసి సినిమా చేయలేదు. ” అంటూ చెప్పుకొచ్చారు.