Viral Photo: ఈ క్యూట్ అబ్బాయి టాలీవుడ్ లవర్ బాయ్.. ప్రేమకథా చిత్రాలకు అతడు కేరాఫ్ అడ్రస్..

మరో విషయం ఈ క్యూట్ అబ్బాయి వాళ్ల మథర్ కూడా ఒకప్పటి హీరోయిన్. ఎవరో గుర్తుపట్టండి. ఇప్పటికీ ఈ చిన్నోడు నటించిన సినిమాలు యూత్‏కు ఆకట్టుకుంటాయి. ఎవరో గుర్తుపట్టండి.

Viral Photo: ఈ క్యూట్ అబ్బాయి టాలీవుడ్ లవర్ బాయ్.. ప్రేమకథా చిత్రాలకు అతడు కేరాఫ్ అడ్రస్..
Actpr

Updated on: Sep 09, 2022 | 7:16 PM

తెలుగు చిత్రపరిశ్రమలో లవర్ బాయ్ అనగానే ఠక్కున గుర్తొచ్చే హీరోస్ చాలా మందే ఉన్నారు. ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో నటించి… అమ్మాయిలకు ఫేవరేట్‏గా మారిన హీరోలను చేతివేళ్లపై లెక్కపెట్టోచ్చు. ఒకప్పుడు లవ్ స్టోరీ మూవీస్ అంటే ఈ కుర్రాడు ఉండాల్సిందే అనేట్టుగా పేరు తెచ్చుకున్నాడు. ఈ అబ్బాయి నటించిన ఎన్నో హిట్ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. తన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్‏కు దగ్గరయ్యాడు. ఎవరో గుర్తుపట్టండి. ఇదంతా పైన ఫోటోలో ఉన్న కుర్రాడి గురించే. తండ్రితో కలిసి ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టండి. మీకోసం మరో క్లూ. అతడు చైల్డ్ ఆర్టిస్ట్‎గా సినీరంగ ప్రవేశం చేసి.. ఆ తర్వాత హీరోగా మారాడు. మరో విషయం ఈ క్యూట్ అబ్బాయి వాళ్ల మథర్ కూడా ఒకప్పటి హీరోయిన్. ఎవరో గుర్తుపట్టండి. ఇప్పటికీ ఈ చిన్నోడు నటించిన సినిమాలు యూత్‏కు ఆకట్టుకుంటాయి. ఎవరో గుర్తుపట్టండి.

పైన ఫోటోలో ఉన్న ఈ కుర్రాడు టాలీవుడ్ లవర్ బాయ్.. అతడే హీరో తరుణ్. అంజలి చిత్రంతో బాలనటుడిగా అరంగేట్రం చేసిన తరుణ్.. ఆ తర్వాత దళపతి, ఆదిత్య 369, గౌరమ్మ, తేజ, సాహసం వంటి చిత్రాల్లో నటించారు. ఆతర్వాత నువ్వే కావాలి సినిమాతో హీరోగా మారిన తరుణ్.. ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, చిరుజల్లు, నువ్వే నువ్వే, అదృష్టం, నిన్నే ఇష్టపడ్డాను వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న తరుణ్.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలలో మెరిశాడు. మరో విషయం తరుణ్ వాళ్ల మథర్ కూడా ఒకప్పటి హీరోయిన్ రోజా రమణి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.