
టాలీవుడ్ హాస్య నటుడు, కమెడియన్, హీరో, సహాయ నటుడు, విలన్ ఎలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు సునీల్. తెలుగు, తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఎంతో మంది జనాల హృదయాలు గెలుచుకున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో సునీల్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మరెవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ‘సూపర్ స్టార్’ అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు రజినీకాంత్. కోట్ల సంఖ్యలో అభిమానులు, బాక్సాఫీస్‌ను షేక్ చేసే మార్కెట్, ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్నప్పటికీ.. ఆయన వ్యక్తిత్వం మాత్రం ఎంతో సాధారణంగా ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో సునీల్ మాట్లాడుతూ రజినీకాంత్ గారి వ్యక్తిత్వం, ఆయన నడుచుకునే తీరు గురించి పంచుకున్న విషయాలు అందరి హృదయాలను టచ్ చేస్తున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..
సినిమా సెట్స్‌లో ఎంత పెద్ద స్టార్ అయినా ప్రత్యేక వసతులు కోరుకోవడం సహజం. కానీ రజినీకాంత్ అలా కాదు. షూటింగ్ సమయంలో ఆయన అందరితో సమానంగా కలిసిపోతారు. క్యారవాన్ వదిలి బయటకు వచ్చి, సెట్స్‌లోని సాధారణ సిబ్బందితో కలిసి కింద కూర్చోవడానికి కూడా ఆయన ఏమాత్రం వెనుకాడరని అన్నారు. ఒక చెట్టు కిందో లేదా రాతి అరుగు మీదో సాదాసీదాగా కూర్చుని, యూనిట్ సభ్యులతో ముచ్చటించడం ఆయన గొప్పతనానికి నిదర్శమని చెప్పుకొచ్చారు. ఆయన అనుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేయగలరు. కానీ, రజినీకాంత్ మెజారిటీ సమయం అంబాసిడర్ లేదా ఇన్నోవా వంటి సాధారణ వాహనాల్లో ప్రయాణించడానికే ఆసక్తి చూపిస్తారని తెలిపారు. ఆడి, బిఎమ్‌డబ్ల్యూ వంటి బ్రాండ్స్ కంటే కంఫర్ట్, సాధారణ జీవనశైలికే ఆయన ప్రాధాన్యత ఇస్తారు.
ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..
ఆయన అందరితో కలిసి భోజనం చేస్తారని, ఎక్కడైనా గట్టు కనబడితే అక్కడే వెళ్లి కూర్చుండిపోతారని పేర్కొన్నారు. లగ్జరీ కార్ల విషయంలోనూ రజినీకాంత్ నిరాడంబరత స్పష్టమవుతుంది. ఆడి కారును వద్దని, సాధారణ ఆర్టిస్టులకు ఉపయోగించే ఇన్నోవా కారు కావాలని ఆయన కోరారని సునీల్ వెల్లడించారు. అంబాసిడర్ కార్లు అందుబాటులో లేకపోవడంతో ఇన్నోవాను ఎంచుకున్నారని తెలిపారు. ఎంత స్టార్‌డమ్ పెరిగితే ఆయన అంతగా డౌన్-టు-ఎర్త్ అవుతారని, ఆయన సాధారణత్వం నిజంగా స్ఫూర్తిదాయకమని చెప్పుకొచ్చారు. కోట్ల ఆస్తులు, అంతటి స్టార్‌డమ్ ఉన్నా తలకెక్కించుకోకుండా, అందరినీ సమానంగా గౌరవించే గుణమే ఆయన్ను కేవలం ఒక నటుడిగానే కాకుండా, కోట్లాది మంది గుండెల్లో ఒక ‘మహా మనిషి’గా నిలిపింది.
ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..
Rajinikanth
ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..