
సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి సినీరంగంలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు సత్యదేవ్. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన.. ఆ తర్వాత హీరోగా మారారు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్నారు. హీరోగానే కాకుండా నటుడిగా, విలన్ పాత్రలతోనూ ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సమవర్తి. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన సినీ ప్రయాణానికి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే డైరక్టర్ ఆర్జీవీతో తనకున్న బాండింగ్ గురించి చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మీ నటించిన సినిమా జ్యోతిలక్ష్మీ. ఈ చిత్రంలో సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించారు. అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. ఒక పాటను చూసి డైరెక్టర్ ఆర్జీవీ పూరీతో మాట్లాడుతూ.. “హీరోను మార్చేయ్.. లేదంటే సినిమా ప్లాప్ అవుతుంది.” అని అన్నారట. ఈ విషయం తెలిసి తాను కాస్త బాధపడ్డానని.. కనీసం సినిమా పూర్తిగా చూడకుండా కేవలం ఒక పాట చూసి వర్మ ఎలా అంటారని ఫీలయ్యానని అన్నారు. కానీ తర్వాత కథ ఊహించని మలుపు తిరిగింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?
జ్యోతిలక్ష్మి సినిమాను పూర్తిగా చూసిన తర్వాత సత్యదేవ్ యాక్టింగ్ చూసి ఆర్జీవీ ఫిదా అయ్యారట. వెంటనే సత్యదేవ్ ను పిలిచి “ఆరోజు నిన్ను మార్చేయమన్నందుకు సారీ.. నువ్వు చాలా బాగా చేశావ్” అంటూ మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పారు. ఆర్జీవీ లాంటి పెద్ద దర్శకుడు తన తప్పు తెలుసుకుని సారీ చెప్పడం తనను ఆశ్చర్యపరిచిందని సత్యదేవ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసి కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..