Raghava Lawrence: మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో చూస్తే కన్నీళ్లాగవు

రాఘవను అభిమానించడానికి సినిమాలకు మించిన కారణం మరొకటి ఉంది . అదే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు. దివ్యాంగులు, అనాథ భాలల కోసం తన వంతు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు లారెన్స్ మాస్టర్. తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారాయన. కొన్ని రోజుల క్రితం ఓ కార్యక్రమంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు కొనుగులు చేసి ఇచ్చారు.

Raghava Lawrence: మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో చూస్తే కన్నీళ్లాగవు
Raghava Lawrence
Follow us

|

Updated on: Apr 18, 2024 | 5:05 PM

కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్, నిర్మాత.. ఇలా సినిమా ఇండస్ట్రీలో ట్యాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్. సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన అతి తక్కువ మందిలో ఆయన కూడా ఒకరు. అందుకే లారెన్స్ ను చాలా మంది అభిమానిస్తారు. అయితే రాఘవను అభిమానించడానికి సినిమాలకు మించిన కారణం మరొకటి ఉంది . అదే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు. దివ్యాంగులు, అనాథ భాలల కోసం తన వంతు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు లారెన్స్ మాస్టర్. తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారాయన. కొన్ని రోజుల క్రితం ఓ కార్యక్రమంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు కొనుగులు చేసి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

‘‘దివ్యాంగులైన వీరందరూ మల్లరకంభంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారని ఇటీవల నేనొక ప్రెస్‌మీట్‌లో చెప్పారు. చేసే పని పట్ల వారికి ఉన్న పట్టుదల, నిబద్ధతను చూసి నేనెంతో సంతోషిస్తున్నాను. అందుకే వారందరికీ బైక్స్‌ ఇవ్వడంతోపాటు ఇళ్లు కట్టిస్తానని నేను మాటిచ్చాను. అందులో భాగంగా ఇప్పుడు 13 ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేశాను. వారికి ఉపయోగపడేలా ఆ వాహనాలను త్రీవీలర్స్‌గా మార్పించనున్నాం. అదే విధంగా, ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే ఇళ్లు కూడా నిర్మిస్తాను’ అని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు రాఘవ లారెన్స్. ఈ సందర్భంగా తమ కోసం లారెన్స్ మాస్టర్ తీసుకొచ్చిన త్రీ వీలర్స్ బైక్ లను చూసి దివ్యాంగులు మురిసిపోయారు. సంతోషంతో గెంతులేశారు.

ఇవి కూడా చదవండి

దివ్యాంగుల ఆనందానికి అవధుల్లేవ్..  ఎమోషనల్  వీడియో

ప్రస్తుతం రాఘవ లారెన్స్ కు సంబంధించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. .

త్రీ వీలర్స్ బైక్ తో రాఘవ లారెన్స్..

రాఘవ చేసిన మంచి పనితో అభిమానులు, నెటిజన్లు ఆయనను మెచ్చుకుంటున్నారు.

దివ్యాంగులతో రాఘవ వారెన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles