Prakash Raj MAA: బ‌రిలోకి దిగ‌నున్న ప్ర‌కాశ్ రాజ్ టీమ్ ఇదే.. 27 మంది స‌భ్యుల‌తో కూడిన ప్యాన‌ల్ ప్ర‌క‌ట‌న‌..

|

Jun 24, 2021 | 3:17 PM

Prakash Raj MAA: తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మా అధ్య‌క్ష ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. ఇప్ప‌టికే అధ్య‌క్ష పోటీలో బ‌రిలో దిగుతున్న‌ట్లు ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, నటీమణులు జీవితా రాజశేఖర్‌, హేమలు ప్రకటించారు. దీంతో ‘మా’లో చతుర్ముఖ...

Prakash Raj MAA: బ‌రిలోకి దిగ‌నున్న ప్ర‌కాశ్ రాజ్ టీమ్ ఇదే.. 27 మంది స‌భ్యుల‌తో కూడిన ప్యాన‌ల్ ప్ర‌క‌ట‌న‌..
Prakash Raj Panel
Follow us on

Prakash Raj MAA: తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మా అధ్య‌క్ష ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. ఇప్ప‌టికే అధ్య‌క్ష పోటీలో బ‌రిలో దిగుతున్న‌ట్లు ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, నటీమణులు జీవితా రాజశేఖర్‌, హేమలు ప్రకటించారు. దీంతో ‘మా’లో చతుర్ముఖ పోటీ నెలకొంది. ఈ నేప‌థ్యంలోనే మా అధ్య‌క్ష ఎన్నిక‌లు సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. దీంతో మునుపెన్న‌డూ లేని విధంగా మా ఎన్నిక‌ల‌పై అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది.
ఈ క్ర‌మంలోనే అధ్య‌క్ష బ‌రిలో ఉన్న ప్ర‌కాశ్ రాజు 27 మందితో కూడిన త‌న ప్యాన‌ల్ స‌భ్యుల‌ను ప్ర‌క‌టించాడు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. `త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మా ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకొని.. ‘మా’ శ్రేయ‌స్సు దృష్ట్యా.. నిర్మాణాత్మ‌క ఆలోచ‌న‌ల‌ని ఆచ‌ర‌ణ‌లో పెట్టే దిశ‌గా మా ప్ర‌తిష్ట‌కోసం.. మ‌న న‌టీ నటుల బాగోగుల కోసం.. సినిమా న‌టీన‌టులంద‌రి ఆశీస్సుల‌తో.. అండ‌దండ‌ల‌తో.. ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డటం కోసం.. ప‌ద‌వులు కాదు ప‌నులు మాత్ర‌మే చేయ‌డం కోసం.. ‘మా’ టీంతో రాబోతున్నాం` అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ప్రకాశ్ రాజ్ ప్యాన‌ల్‌లో ఉన్న 27 మంది ఎవ‌రంటే.. ప్రకాశ్‌రాజ్‌, జ‌య‌సుధ‌. శ్రీకాంత్‌, బెన‌ర్జీ, సాయికుమార్‌, తనీష్‌, .ప్రగతి, అన‌సూయ‌, స‌న, అనిత చౌద‌రి, సుధ‌, అజ‌య్‌, నాగినీడు, బ్రహ్మాజీ, ర‌విప్రకాష్‌, స‌మీర్‌, ఉత్తేజ్, బండ్ల గణేష్, ఏడిద శ్రీరామ్‌, శివారెడ్డి, భూపాల్‌, టార్జాన్‌, సురేష్ కొండేటి, ఖ‌య్యుం, సుడిగాలి సుధీర్, గోవింద‌రావు, శ్రీధ‌ర్‌రావు.

Also Read: MAA Elections: పోటీలో నలుగురు అభ్యర్థులు.. రసవత్తరంగా ‘మా’ ఎన్నికలు… పదవి పోటీపై క్లారిటీ ఇవ్వనున్న మంచు విష్ణు..

OTT: ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి.!

Britney Spears: ‘నా జీవితాన్ని నాకు ఇచ్చేయ్యండి’.. తండ్రి చేర నుంచి విడిపించాలని కోర్టును ఆశ్రయించిన పాపులర్ సింగర్..