Ajith Kumar: మళ్లీ కార్ రేసింగ్‏లోకి అజిత్.. ? నెట్టింట వైరలవుతున్న వీడియో.. సినిమాలకు గుడ్ బై ?

గతేడాది మొదలైన విడసిల సినిమనా షూటింగ్ కొన్ని రోజులకే ఆగిపోయింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల పోస్టర్లు విడుదలై అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో నటుడు అర్జున్, నటి త్రిష, ఆరవ్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Ajith Kumar: మళ్లీ కార్ రేసింగ్‏లోకి అజిత్.. ? నెట్టింట వైరలవుతున్న వీడియో.. సినిమాలకు గుడ్ బై ?
Ajith
Follow us

|

Updated on: Oct 15, 2024 | 8:09 AM

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినీ ప్రయాణం చాలా ప్రత్యేకం. సినిమా ఈవెంట్స్, ప్రమోషన్స్ కు దూరంగా ఉంటాడు. అభిమానులతో మీటింగ్స్, మీడియా ప్రెస్ మీట్స్ ఇలాంటివి అజిత్ కు అసలు సంబంధమే ఉండదు. అయినా ఈ స్టార్ హీరో సినిమాల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. విడుదలకు ముందే అజిత్ సినిమాలపై ఓ రేంజ్ హైప్ నెలకొంటుంది. ఈ ఏడాది తునీవు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన అజిత్.. ఇప్పుడు విదాయముర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో నటిస్తున్నాడు. కొన్నిరోజులుగా ఈ మూవీ షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. గతేడాది మొదలైన విడసిల సినిమనా షూటింగ్ కొన్ని రోజులకే ఆగిపోయింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల పోస్టర్లు విడుదలై అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో నటుడు అర్జున్, నటి త్రిష, ఆరవ్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాతోపాటు అజిత్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమా రూపొందిస్తున్నారు. టైటిల్ తో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందింది. మైత్రి మూవీ మేకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ గత జూన్‌లో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా మొదటి దశ ఒక నెల షూటింగ్ జూలైలో పూర్తయింది. అభిమానుల ఆత్రుతని అజిత్ అర్థం చేసుకుని, అందుకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తుండడంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెరిగాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. అజిత్ మళ్లీ కార్ రేసింగ్ లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

చాలా ఏళ్లుగా కార్ రేసుల్లో పాల్గొనని నటుడు అజిత్ కుమార్ మళ్లీ కార్ రేసుల్లో పాల్గొనబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. 2003 నుంచి కార్ రేసింగ్‌లో నిమగ్నమైన అజిత్.. ఇప్పుడు మళ్లీ కార్ రేస్ జర్నీ ప్రారంభించబోతున్నట్లు కొంత సమాచారం బయటకు వచ్చింది. దీనికి ముందు నటుడు అజిత్ 2003 సంవత్సరంలో జరిగిన “ఫార్ములా BMW ఆసియా” అనే కార్ రేస్‌లో పాల్గొని ఆ రేసులో 12వ స్థానంలో నిలిచాడు. అంతే కాదు 2010లో జరిగిన ఫార్ములా 2 రేసుల్లో కూడా పాల్గొన్నాడు. అజిత్‌కు నటనతో పాటు రేసింగ్‌పై కూడా ఆసక్తి ఉంది. ఇటీవలే రెండు ఖరీదైన స్పోర్ట్స్ కార్లను కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. కారు కొనే ముందు అందులో కూర్చొని యాక్సిలరేటర్‌తో ఎంజాయ్ చేస్తున్న వీడియోను అజిత్ కుమార్ ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.