14 October 2024

నారా రోహిత్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా..? 

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ప్రతినిధి 2 సినిమా హీరోయిన్‏ను పెళ్లి చేసుకోనున్నాడు. 

ప్రతినిధి 2 సినిమాలో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరియోన్ సిరి లేళ్లతో కలిసి ఇప్పుడు జీవితాన్ని పంచుకోనున్నాడు ఈ టాలీవుడ్ హీరో. 

అక్టోబర్ 13న ఆదివారం వీరిద్దరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. 

హీరోయిన్ సిరి లేళ్ల గురించి చాలా మందికి తెలియదు. దీంతో ఇప్పుడు ఆమె బ్యాగ్రౌండ్ గురించి గూగుల్ సెర్చ్  చేస్తున్నారు చాలా మంది ఫ్యాన్స్.

సిరి లెల్లా అచ్చమైన తెలుగమ్మాయి. బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన సిరి.. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో మాస్టర్స్ కంప్లీట్ చేసి అక్కడే జాబ్ చేసినట్లు టాక్. 

నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ప్రతినిధి 2 సినిమా అడిషన్స్ జరుగుతుండగా వెళ్లి లక్కీగా కథానాయికగా ఆ సినిమాకు ఎంపికైంది. 

ఆ సినిమా చిత్రీకరణలో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకథ నడిచినట్లు సమాచారం.

నారా రోహిత్ తన ప్రేమ విషయాన్ని ముందుగా పెద్దమ్మ భువనేశ్వరికి చెప్పారట. వీరిద్దరి పెళ్లి  వేడుక డిసెంబర్ నెలలో జరగనుందని తెలుస్తోంది.