Viral News: కూతురితో కలిసి ఎడారిలో సేద తీరుతున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టండి..

|

Feb 01, 2022 | 12:06 PM

సోషల్ మీడియాలో ఇప్పుడు సెలబ్రెటీలు ఎంత యాక్టివ్‏గా ఉంటున్నారో తెలిసిందే. కేవలం సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా..ఫ్యామిలీ విషయాలు..

Viral News: కూతురితో కలిసి ఎడారిలో సేద తీరుతున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టండి..
Actor
Follow us on

సోషల్ మీడియాలో ఇప్పుడు సెలబ్రెటీలు ఎంత యాక్టివ్‏గా ఉంటున్నారో తెలిసిందే. కేవలం సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా..ఫ్యామిలీ విషయాలు.. వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు.. ఏ సమయానికి తమ అభిమాన స్టార్ హీరోహీరోయిన్స్ ఎక్కడ ఉంటున్నారు.. ఎవరితో కలిసి ఏ దేశాలకు ట్రిప్ వెళ్లారు.. ఇలా ప్రతీది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్టార్స్ చేసే ప్రతి చిన్న అప్డేట్ క్షణాల్లో వైరల్ అవుతుంటుంది.

అయితే ఇప్పటివరకు స్టార్ హీరోహీరోయిన్స్ త్రోబ్యాక్ ఫోటోస్.. రేర్ పిక్స్, చిన్ననాటి ఫోటోస్ షేర్ అవుతున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి, పూజా హెగ్డే, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా ఇలా ఒక్కరేమిటీ యంగ్ హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫోటో తెగ వైరల్ అవుతుంది. అందులో ఓ స్టార్ హీరో తన కూతురితో కలిసి ఎడారిలో సేద తిరుతున్నాడు.

పైన ఫోటో చూశారు కదా.. తండ్రి తనయ.. ఇద్దరు కలిసి ఎడారిలో ఆటలాడి విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిద్దరు ఎవరో కనిపెట్టగలరా..మీ కోసం ఒక చిన్న క్లూ… ఆ హీరో కూడా మరో స్టార్ హీరో తనయుడు. ఆ హీరో వారసుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. అంతేకాకుండా.. ఫస్ట్ మూవీతోనే యూత్‏లో క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఆ హీరో మరెవరో కాదండి.. టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్. సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడిగా చిత్రపరిశ్రమలోకి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఆది. ప్రేమకావాలి, లవ్లీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆది… ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆది సాయి కుమార్ 2014లో అరుణను వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు ఉంది.

Also Read: Suman: సైన్యానికి 117 ఎకరాల భూమి విరాళం.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరో..

Pooja Hegde: ఆనందంలో తెగ మురిసిపోతున్న బుట్టబొమ్మ.. నెక్ట్స్ లెవల్ ఎక్స్‏పిరియన్స్ అంటూ పూజా హెగ్డే పోస్ట్..

30 Weds 21 Season 2: ఆకట్టుకుంటున్న 30 వెడ్స్ 21 టీజర్.. ప్రపంచాన్ని చూసేందుకు సిద్ధమయిన జంటపక్షులు..

Thamannah: తమన్నా ఛాలెంజ్‏కు భారీ రెస్పాన్స్.. సోషల్ మీడియాలో మిల్కీబ్యూటీ రచ్చ మాములుగా లేదుగా..