
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేశాడు అభిషన్ జీవింద్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దర్శకుడిగా సక్సెస్ అయిన అతడు ఇప్పుడు హీరోగానూ భారీ విజయాన్ని అందుకున్నాడు. అభిషన్ జీవింద్ హీరోగా పరిచయమైన మూవీ విత్ లవ్. ఈ చిత్రంలో మలయాళ నటి అనశ్వర రాజన్ కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని అభిషన్ జీవింద్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మధన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రజనీకాంత్ కుమార్తె సౌందర్య నిర్మించగా.. సీన్ రోల్డాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో విడుదలైంది.
మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. తొలి రోజు 2 కోట్లకు పైగా వసూలు చేసింది. సినిమా విడుదలైన 10 రోజులకు రూ. 25 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అంతేకాదు. ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమా హావా నడుస్తుంది. మరో నాలుగైదు రోజుల్లో ఈ చిత్రానికి రూ.50 కోట్లు రావడం ఖాయమని తెలుస్తోంది. అలాగే తొలి చిత్రంతోనే అభిషన్ జీవింద్ హీరోగా కూడా తనదైన ముద్ర వేశాడు.
నేటి యువత ప్రేమను దృష్టిలో ఉంచుకుని కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ యూత్ కు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూల్లు రాబడుతుంది.
Thank you once again ❤️😬 #WithLove @Abishanjeevinth @madhann_n @soundaryaarajni @mageshraj @SonyMusicSouth @Zionfilmsoff pic.twitter.com/46pWRa6V2E
— Sean Roldan (@RSeanRoldan) February 16, 2026