Aadi Sai Kumar: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. క్రేజీ ఫెలోగా ఆది.. థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు..

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

Aadi Sai Kumar: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. క్రేజీ ఫెలోగా ఆది.. థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు..
Crazy Fellow

Updated on: Jul 09, 2022 | 7:00 PM

యంగ్ హీరో ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం క్రేజీ ఫెలో. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో నిర్మాణంలో నిర్మాత కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తుండగా.. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా వుంది. ఆది చేతిలో గులాబీ పువ్వుల గుత్తితో నవ్వుతూ కనిపిస్తుండగా, హీరోయిన్లు దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ సీతాకోకచిలుక రెక్కలుగా చెరో వైపు కనిపించడం ఎలిగెంట్ గా వుంది. ఆర్‌ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటివరకు విడుదలైన పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ఈ చిత్రానికి సతీష్‌ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సత్య గిడుతూరి ఎడిటర్ గా, కొలికపోగు రమేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, రామ కృష్ణ స్టంట్ మాస్టర్స్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్ర ప్రోమోషన్స్ ను దూకుడుగా నిర్వహిస్తోంది చిత్ర యూనిట్.

Loading...
Unable to load recommendations.
Follow Us