జంధ్యాల పరిచయం చేసిన ఆ నవ్వుకు 65 వసంతాలు.. టాలీవుడ్‌‌‌‌లో ఆకాశాన్ని తాకిన హాస్య శిఖరం బ్రహ్మానందం..

ఆయన పేరు చెప్తే చాలు తెలియకుండానే పెదాలమీదకు నవ్వొస్తుంది. సినిమాలో ఆయన కనిపిస్తే థియేటర్స్ లో నవ్వుల వర్షం కురుస్తుంది. ఆయనే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం.

జంధ్యాల పరిచయం చేసిన ఆ నవ్వుకు 65 వసంతాలు.. టాలీవుడ్‌‌‌‌లో ఆకాశాన్ని తాకిన హాస్య శిఖరం బ్రహ్మానందం..

Updated on: Feb 01, 2021 | 5:20 PM

Brahmanandam : ఆయన పేరు చెప్తే చాలు తెలియకుండానే పెదాలమీదకు నవ్వొస్తుంది. సినిమాలో ఆయన కనిపిస్తే థియేటర్స్ లో నవ్వుల వర్షం కురుస్తుంది. ఆయనే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. నేడు ఈ కామెడీ కింగ్ 65 పుట్టిన రోజు. గత కొంతకాలంగా బ్రహ్మానందం సినిమాల్లో కనిపించింది తక్కువే అయినా సోషల్ మీడియాలో ఆయన నటించిన కామెడీ సన్నివేశాలు ఎప్పుడు తారసపడుతూనే ఉంటాయి. మీమ్ మేకర్స్ కు ఆయన దేవుడనే చెప్పాలి. ఎన్నో మీమ్స్ బ్రహ్మానందం ఫొటోలతో ఆయన కామెడీ డైలాగులతో ,వీడియోలతో సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. కేవలం బ్రహ్మానందంహాస్యనటుడుమాత్రమేకాదు గొప్పచిత్రకారుడు కూడా ఆయన కుంచే నుంచి అనే రూపాలు జాలువారాయి.

ఇక ఈ హాస్య శిఖరంతో నటించని అగ్ర హీరో లేడనేది వాస్తవం. కుర్రహీరోలైనా.. సీనియర్ హీరోల సినిమాలోనైనా  ఆయన కనిపించాల్సిందే.. నవ్వించాల్సిందే. సినిమాలో బ్రహ్మానందం లేకపోతే ఎదో వెలితిగా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బ్రహ్మానందం ఎంట్రీ ఇస్తే స్టార్ హీరోకు ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులు ఈలవేసి గోల చేసే వారంటే.. ఆడియన్స్ లో ఆయనకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మానందం ఎందరికో ఆదర్శం. నటన ఎవ్వరైనా చేయగలరు.. కానీ నవ్వించడం అందరివల్ల కాదు. అది కొందరికే సాధ్యం అందులో బ్రహ్మానందం ప్రముఖులు.

జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆహ నా పెళ్లంట’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాలో ‘అరగుండు’ పాత్రలో ఆయన పండించిన హాస్యం.. తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసింది. అప్పటినుంచి ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.. ఎన్నో మొదట్లో ఆయన సినిమా అవకాశాలను వెతుకుంటూ వెళ్లారు. ఇప్పుడు ఆయనకోసం అవకాశాలు క్యూకడుతున్నాయి. దర్శకులు బ్రహ్మానందం కోసం ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ రాసుకుంటారు. నేడు అయన పుట్టినరోజు సందర్భంగా సీనియర్ హీరోలనుంచి కుర్రహీరోలదాకా.. పాత దర్శకులనుంచి కొత్త దర్శకుల వరకు. అందరు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


మరిన్ని ఇక్కడ చదవండి : 

Actress Mirnalini Ravi : గద్దలకొండ భామకు సినిమాలు ఇక్కడ నిల్లు.. అక్కడ ఫుల్లు..!

Loading...
Unable to load recommendations.
Follow Us