జైలర్ 2లో ఆ హీరో కూడా ఉంటారన్నారే.. రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ షాక్

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జైలర్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ రోజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

జైలర్ 2లో ఆ హీరో కూడా ఉంటారన్నారే.. రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ షాక్
Jailer 2

Updated on: Oct 15, 2026 | 3:36 PM

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో.. దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘జైలర్ 2’పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలు అతిథి పాత్రల్లో కనిపిస్తారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ పేరు కూడా తెరపైకి వచ్చింది. బాలయ్య ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో కనిపించబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తలు నిజమవుతాయని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇంతకీ బాలకృష్ణ పేరు ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చింది? ఆయన ఈ సినిమాలో నటించకపోవడానికి కారణాలేమైనా ఉన్నాయా?

2023లో విడుదలైన ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్‌తో పాటు మలయాళ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కీలకమైన అతిథి పాత్రల్లో కనిపించారు. ఈ స్టార్ హీరోల ప్రత్యేక పాత్రలు సినిమాకు మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి. దీంతో సీక్వెల్‌లో కూడా ఇదే తరహాలో ఇతర భాషల అగ్ర నటులను తీసుకుంటారని ప్రచారం మొదలైంది.

నిజానికి తొలి ‘జైలర్’ సినిమాలో బాలకృష్ణను కూడా ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించాలని దర్శకుడు నెల్సన్ భావించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ కాంబినేషన్ కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో ‘జైలర్ 2’లోనైనా రజనీకాంత్, బాలకృష్ణ కలిసి కనిపిస్తారనే అంచనాలు పెరిగాయి. ఈ ప్రచారమే అభిమానుల్లో భారీ ఆసక్తిని కలిగించింది. దాంతో బాలయ్య అభిమానులు, అటు సూపర్ స్టార్ ఫాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ అలా జరగలేదు. జైలర్ 2 సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమాలో మొదటి భాగంలోలానే చాలా మంది గెస్ట్ రోల్స్ లో కనిపించారు.  కానీ బాలయ్య కనిపించపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. కానీ బాలయ్య, సూపర్ స్టార్ కలిసి నటిస్తే మాత్రం అదిరిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us