AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Serial : సీరియల్లో పనిమనిషి.. బయట గ్లామర్ బీభత్సం.. నెట్టింట రచ్చ లేపుతున్న వయ్యారి..

ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్ బ్యూటీలకు ఏరేంజ్ ఫాలోయింగ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం సీరియల్ తారలు చేసే రచ్చ గురించి తెలిసిందే. సీరియల్లో పద్దతిగా కనిపించి.. నెట్టింట మాత్రం గ్లామర్ అరాచకం సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఈ అమ్మడు కూడా అంతే..

Serial : సీరియల్లో పనిమనిషి.. బయట గ్లామర్ బీభత్సం.. నెట్టింట రచ్చ లేపుతున్న వయ్యారి..
Divya
Rajitha Chanti
|

Updated on: Aug 23, 2025 | 8:21 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో సీరియల్ బ్యూటీలకు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. సినిమా హీరోహీరోయిన్లకు మించిన క్రేజ్ ఇప్పుడు సీరియల్ తారలకు వస్తుంది. ఎందుకంటే తమ నటనతో ప్రతిరోజూ ఫ్యామిలీ ప్రేక్షకులను అలరిస్తున్నారు కాబట్టి. అయితే సీరియల్ హీరోహీరోయిన్లకు మాత్రమే కాదు.. అమ్మ, అత్త, వదిన పాత్రలు పోషిస్తున్న పలువురు సెలబ్రెటీలకు సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక విలన్ పాత్రల గురించి చెప్పక్కర్లేదు. ఇన్నాళ్లు సీరియల్లో పద్దతిగా కనిపించిన ముద్దుగుమ్మలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందాలతో గత్తరలేపుతున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటున్నారు. సీరియల్లో చీరకట్టులో ఎంతో పద్దతిగా కనిపించిన ముద్దుగుమ్మలు.. బయట మాత్రం అందాలతో కట్టిపడేస్తున్నారు. ఇక ఇన్నాళ్లు సీరియల్లో పనిమనిషి పాత్రలో కనిపించిన ఈ అమ్మడు.. నెట్టింట మాత్రం గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ గుర్తుందా.. ? బుల్లితెరపై సంచలనం సృష్టించిన కార్తీక దీపం సీరియల్లో పనిమనిషి పాత్రలో కనిపించింది.

ఇవి కూడా చదవండి : Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..

ఇవి కూడా చదవండి

కార్తీక దీపం.. దాదాపు ఏడేళ్లు బుల్లితెరపై చక్రం తిప్పిన సీరియల్. ఇందులో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలతోపాటు అంతకు మించిన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న రోల్ మోనితా. ఇక ఇదే సీరియల్లో పనిమనిషి ప్రియమణి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. మోనితాకు, ప్రియమణికి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను తెగ నవ్వించాయి. ఇందులో ప్రియమణి పాత్రలో కనిపించిన అమ్మడు పేరు అంబటి దివ్య. కార్తీక దీపం సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన యాక్టింగ్, కామెడీ టైమింగ్ తో జనాలకు దగ్గరయ్యింది.

ఇవి కూడా చదవండి : Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..

కార్తీక దీపం తర్వాత పలు సీరియల్స్ చేసిన దివ్య.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. సీరియల్లో పద్దతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. నెట్టింట మాత్రం చాలా హాట్ గా కనిపిస్తుంది. తాజాగా నెట్టింట ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అటు చీరకట్టులో పద్దతిగా కనిపిస్తూనే.. ఇటు మోడ్రన్ డ్రెస్సులలో స్టన్నింగ్ ఫోజులతో మెస్మరైజ్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి : Cinema : రెండు గంటల సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. దెబ్బకు దద్దరిల్లిన బాక్సాఫీస్.. ఎక్కడ చూడొచ్చంటే..

Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..