Hyper Aadi: తనపై దాడి చేశారనే వార్తలపై స్పందించిన హైపర్ ఆది.. వారికి స్వయంగా డబ్బులిస్తానంటూ..

బుల్లితెర ప్రేక్షకులకే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని జనాలకు హైపర్ ఆది పెద్దగ పరిచయం అవసరం లేని పేరు. జబర్ధస్థ్ కామెడీ షోలో

Hyper Aadi: తనపై దాడి చేశారనే వార్తలపై స్పందించిన హైపర్ ఆది.. వారికి స్వయంగా డబ్బులిస్తానంటూ..
Hyper Aadi

Updated on: Nov 11, 2021 | 8:34 AM

బుల్లితెర ప్రేక్షకులకే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని జనాలకు హైపర్ ఆది పెద్దగ పరిచయం అవసరం లేని పేరు. జబర్ధస్థ్ కామెడీ షోలో హైపర్ ఆది వేసే పంచులు.. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తుంటాడు. ఇక సందర్భానుసారంగా ఆది వేసే డైలాగ్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆదికి ఫాలోయింగ్‏తోపాటు వివాదాలు కూడా కాస్త ఎక్కువే. ఆది వేసే స్క్రిప్ట్.. డైలాగ్స్ వలన కొందరు అతడిని టార్గెట్ చేస్తుంటారు. ఇక సమాజంలో జరుగుతున్న పరిణామాలు.. సినీ, రాజకీయ ప్రముఖులు మాట్లాడిన మాటలను తనదైన శైలీలో ఇమిటేట్ చేస్తూ నవ్వులు పూయిస్తాడు ఆది. అయితే ఇలా చేయడం వలన చాలా సందర్భాల్లో అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. కొన్నిసార్లు ఆది.. కాస్త వెనకడుగు వేసి క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా లేకపోలేదు.

ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన దీపావళి స్పెషల్ ప్రోగాంలో హైపర్ ఆది.. ఆటో రాంప్రసాద్ వేసి స్కిట్‏లో ఆది మరోసారి పంచులు.. డైలాగ్స్‏తో ప్రేక్షకులను అలరించాడు. ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు మాటలను ఇమిటేట్ చేశాడు ఆది. దీంతో మంచు విష్ణు అభిమానులు హైపర్ ఆది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఆది నిరాకరించడంతో ఆయనపై మంచు విష్ణు అభిమానులు దాడి చేశారని వార్తలు వచ్చాయి. తాజాగా తనపై దాడి జరిగినట్లుగా వస్తున్న వార్తలపై హైపర్ ఆది స్పందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆది సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇందులో ఆది మాట్లాడుతూ.. గత రెండు రోజుల నుంచి నెట్టంట్లో ఫేక్ న్యూస్ లు చక్కర్లు కొడుతున్నాయి. నా కోసం ఎవరో వెతుకుతున్నారని.. నా మీద దాడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇందులో నిజం లేదు.. అరె నాన్న.. ఇలాండి ఫేక్ న్యూస్ లు ఎందుకు రాస్తారు.. మీ దగ్గర డబ్బులు లేకపోతే నన్ను అడగండి.. నేను సంపాదించేదాంట్లో కొంత ఇస్తాను.. అసలు ఇలాంటి వార్తలు రాసేవాడిని మా శాంతి స్వరూప్ కు అప్పగిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

ట్వీట్..

Also Read: Thaman: పుష్ప పాటలపై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్.. ఏం చెప్పారంటే..

Megastar Chiranjeevi: గ్రాండ్‏గా ప్రారంభమైన భోళా శంకర్.. చిరంజీవి సినిమా పూజా కార్యక్రమాలు లైవ్.. 

 

Loading...
Unable to load recommendations.
Follow Us