Brahmamudi, May 9th episode: ఇంట్లోంచి వెళ్లిపోతానన్న కావ్య.. నిజం చెప్పబోయిన సుభాష్..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్‌ని నిలదీస్తుంది అపర్ణ. కానీ రాజ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక దొరికిన ఛాన్స్‌ని ఉపయోగించుకుని.. పుల్లలు పెట్టేలా మాట్లాడుతుంది రుద్రాణి. రాజ్ నాకు మొదటి నుంచీ మతి మరుపు అనే జబ్బు ఉంది. నిన్ను నా కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నా. నువ్వు వెళ్లి పోతే ఆ బాధ పమర్చిపోవడం నా వల్ల కాదురా.. అలాంటి నిర్ణయాలు తీసుకోకు. నిజం చెప్పరా అని ప్రకాశం అంటాడు. రాజ్ ఇంత మంది అడుగుతుంటే నిజం..

Brahmamudi, May 9th episode: ఇంట్లోంచి వెళ్లిపోతానన్న కావ్య.. నిజం చెప్పబోయిన సుభాష్..
Brahmamudi
Follow us

|

Updated on: May 09, 2024 | 12:28 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్‌ని నిలదీస్తుంది అపర్ణ. కానీ రాజ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక దొరికిన ఛాన్స్‌ని ఉపయోగించుకుని.. పుల్లలు పెట్టేలా మాట్లాడుతుంది రుద్రాణి. రాజ్ నాకు మొదటి నుంచీ మతి మరుపు అనే జబ్బు ఉంది. నిన్ను నా కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నా. నువ్వు వెళ్లి పోతే ఆ బాధ పమర్చిపోవడం నా వల్ల కాదురా.. అలాంటి నిర్ణయాలు తీసుకోకు. నిజం చెప్పరా అని ప్రకాశం అంటాడు. రాజ్ ఇంత మంది అడుగుతుంటే నిజం చెప్పవేంటి? ఎందుకు తప్పు జరిగింది? ఆ తప్పును సరిదిద్దడానికి మార్గం ఉందా లేదా అనేది చెప్పు? ఆ బిడ్డ తల్లికి భార్య స్థానం ఇవ్వాలి అనుకుంటున్నావా? ఈ ఇంటి కోడలిగా తీసుకు రావాలి అనుకుంటే నిర్భయంగా చెప్పు అని అంటుంది అపర్ణ.

కావ్యకు మీరిచ్చే బహుమానం ఇదేనా?

అపర్ణ మాటలకు అందరూ షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నారు? ఆంటీ? ఇప్పటికే మా కావ్య బతుకు అన్యాయం అయిపోయిందని ఒక పక్క బాధ పడుతుంటే.. బిడ్డను కని వదిలేసి పోయినదాన్ని తీసుకొచ్చి రాజ్‌కి కట్టబెడతానని అంటున్నారేంటి? మా కావ్య ఏమైపోయినా పర్వాలేదా? ఎంత మంది ఎన్ని అన్నా నోరు మూసుకుని పడి ఉన్నందుకు ఇదా? మీరు ఇచ్చే బహుమానం? అని స్వప్న అడిగితే.. స్వప్నా ఇది మా కుటుంబ సమస్యని చెబుతుంది. ఏంటి? ఏ కుటుంబ సమస్యా? ఈ సమస్యను ఎవరు లేవనెత్తారు? ఎవరు పెద్దది చేస్తున్నారు? ఈ కుటుంబం అంతా కలిసి వాడిని వెలివేయమని చెప్పామా? ఇంట్లో నుంచి పంపించేయమని చెప్పావా? అని ఇందిరా దేవి.. అపర్ణను నిలదీస్తుంది.

కావ్యకు అన్యాయం జరగకూడదు..

వదినా మేమందరం నీ మాటకు కట్టుబడి ఉన్నాం. నీకు ఎదురు కూడా చెప్పం. నువ్వు చెప్పే తీర్పుపై నమ్మకంగా ఉంటాం. కానీ రాజ్ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలన్నీ ఒక తల్లిగా తీసుకుంటున్నట్లు లేవు. అందుకే మీ మాటకు ఎదురు చెప్పకుండా ఉండటం మాకు తప్పడం లేదు. ఆ బిడ్డ తల్లిని కోడలిగా చేసుకుంటే ఎవ్వరం సహించలేం. కావ్య జీవితం అన్యాయం అయిపోయే ఈ ఆలోచన మీరు మానుకోండని ప్రకాశం చెప్తాడు. ఏమైంది పెద్దమ్మా.. నన్నే కొడుకునే చూసుకున్నారు. ఇప్పుడు సొంత కొడుకు విషయంలో ఎందుకు ఇంత పంతానికి పోతున్నారు? అని కళ్యాణ్ అడుగుతాడు. ఆవిడకు మా అత్త నవ్వుతుందనో, మీ అమ్మ దెప్పిపొడుస్తుందేమోనని భయం. అందుకు ఆవిడ అహం ఒప్పుకోకపోక.. కొడుకు, కోడలు ఏమైపోతే నాకేంటి? అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు.

ఇవి కూడా చదవండి

నేను కూడా ఇంట్లోంచి వెళ్లిపోతానన్న కావ్య..

దయచేసి మీరంతా మౌనంగా ఉంటారా.. ఎవరూ ఏం అనుకోవద్దు. ఇది నాకూ మా అమ్మకు మధ్య జరుగుతున్న సంఘర్షణ మాత్రమే. మా అమ్మ ఏం నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని రాజ్ అంటాడు. విన్నావా.. మరి నీ మాట ఏంటి? అని కావ్యను ప్రశ్నిస్తుంది అపర్ణ. నేను ఓడిపోయాను అత్తయ్యా.. ఏం జరిగింది అనేది అనవసరం. ఇప్పుడే ఏం జరిగినా దానికి నేను తలవంచుతాను. ఓడిన వాళ్లకు అవకాశం అడిగే అర్హత ఉండదు. మీ నిర్ణయాన్ని కాదనే హక్కు మీ కొడుక్కే లేనప్పుడు.. నాకు కూడా ఉండదు. కాబట్టి భర్త లేని అత్తింట్లో ఏ ఆడదీ ఉండకూడదు. తప్పో ఒప్పో నేను నా భర్తతో నేను కూడా బయటకు వెళ్లిపోతాను అని కావ్య అంటుంది. శభాష్ కావ్య.. రాజ్ వెంటే వెళ్తానని అంటున్నావ్. నిన్ను కూడా వెళ్లిపోకముందే నీ భర్త గౌరవాన్ని కాపాడుకున్నావ్.

నేనే ఈ ఇంట్లోంచి వెళ్లిపోతాను..

అపర్ణా నీ నిర్ణయం నువ్వు తీసుకున్నావ్? తండ్రిగా నాకు వాడి మీద ఏ హక్కూ లేదా? ఈ ఇంటి పెద్ద కొడుకుకా నా నిర్ణయాలకు ఎలాంటి హక్కు ఉండదా? అని సుభాష్ అడిగితే.. ఉంటుందండి.. నేను ఆవేశంలో పడి ఆ విషయమే మర్చిపోయాను. నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు ఇల్లంతా ఏకమై నా మీద దండెత్తితే కానీ ఇప్పుడు తెలిసి రాలేదు. ఈ ఇంట్లో నాకు ఎలాంటి హక్కులు లేనప్పుడు.. రేపు ఉదయం లోగా రాజ్ జరిగింది ఏంటో చెప్పాలి. లేదంటే నేను ఇల్లు వదిలి వెళ్లిపోతానని అపర్ణ అంటుంది.

అపర్ణపై సుభాష్ సీరియస్..

ఈ సీన్ కట్ చేస్తే.. అపర్ణ గదిలో కూర్చొంటుంది. అక్కడికి సుభాష్ వచ్చి నీ నిర్ణయం నాకు నచ్చలేదు అపర్ణ. అప్పుడు నీకూ రుద్రాణికి ఎలాంటి తేడా ఉండదని అంటాడు. దయచేసి నన్ను రుద్రాణి లాంటి ఆదర్శ స్త్రీ మూర్తితో పోల్చి అవమానించకండి. నాకు ఈ ఇంట్లో ఉండే ధైర్యం లేదని అపర్ణ అంటుంది. అందుకని ఇలా చేస్తావా? రాజ్ విషయంలో నువ్వు రోజు రోజుకూ మొండిదానిలా తయారవుతున్నావ్? వాడు మన కన్న కొడుకు అన్న విషయం మర్చిపోతున్నావ్ అని సుభాష్ అంటాడు. ఇదేనా మీరు నా గురించి అర్థం చేసుకున్నది. అమ్మ ఎప్పటికీ అమ్మనే. వాడి పతనం ఎప్పటికీ కోరుకోదు. ఇవన్నీ చేస్తే అయినా వాడు నోరు విప్పుతాడని ఆశ పడ్డానని అపర్ణ అంటుంది.

బిడ్డ తల్లితో రాజ్‌కి పెళ్లి చేస్తాను..

నేను లేని సమయంలో నా కొడుక్కి ఇష్టం లేని పెళ్లి చేశారు. వాడు ఆ అమ్మాయితో గదిలో కలిసే ఉన్నాడే తప్పా.. కలిసి కాపురం చేయడం లేదు. అది నాకు ఎప్పుడో తెలుసు. వాడికి సుఖం లేదు.. శాంతి లేదు.. అందుకే మరోచోట వాడికి నచ్చిన అమ్మాయికి దగ్గరయ్యాడు. బిడ్డను కూడా కన్నాడు. కావ్య నచ్చలేదని ఇంట్లో చెప్పలేక.. నచ్చిన అమ్మాయిని ఇంటికి తీసుకు రాలేక తన కన్న బిడ్డను ఇంటికి తీసుకొచ్చి.. ఈ ఇంటికి వారసుడిని చేశాడు. అప్పటి నుంచి వాడి మనసు వాడి మనసులో లేదు. నేను ఇంత కఠినంగా ఉన్నది.. వాడు నిజం చెప్పాలనే. ఆ బిడ్డ తల్లిని ఇంటికి తీసుకు రావాలని అపర్ణ అంటుంది. ఒకవేళ ఆ అమ్మాయి ఎవరో చెప్తే.. వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని అపర్ణ అంటుంది. దీంతో సుభాష్ భరించలేడు. కావ్య కూడా ఏం సుఖ పడింది.. అలాంటి వాడితో ఆమె ఏం కలిసి ఉంటుంది? కాపురం చేస్తుందని అపర్ణ అంటుంది. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్‌ ముగుస్తుంది.

Latest Articles
పాయల్‌ను సినిమాల నుంచి బ్యాన్ చేస్తామంటూ వార్నింగ్‌.. అసలేమైంది
పాయల్‌ను సినిమాల నుంచి బ్యాన్ చేస్తామంటూ వార్నింగ్‌.. అసలేమైంది
ఎన్నికల ఫలితాలకు ముందే.. కొత్త మూవీస్ అప్‌డేట్స్.. ఏంటా సినిమాలు?
ఎన్నికల ఫలితాలకు ముందే.. కొత్త మూవీస్ అప్‌డేట్స్.. ఏంటా సినిమాలు?
విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూపే కార్డుంటే చాలు..
విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూపే కార్డుంటే చాలు..
రూ.5 వేలకు ఓటు అమ్ముకొన్న మంగళగిరి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
రూ.5 వేలకు ఓటు అమ్ముకొన్న మంగళగిరి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
టాప్‌ లేపుతున్న రైల్వే స్టాక్‌.. ఏడాదిలో 170శాతానికి పైగా వృద్ధి
టాప్‌ లేపుతున్న రైల్వే స్టాక్‌.. ఏడాదిలో 170శాతానికి పైగా వృద్ధి
6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో ఓటింగ్
6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో ఓటింగ్
వారంలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
వారంలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..