Brahmamudi, January 19th episode: కన్నీరుమున్నీరైన కావ్య.. రుద్రాణితో కలిసి అనామిక కొత్త ప్లాన్!

|

Jan 20, 2024 | 10:22 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. శ్వేత కొట్టడానికి తలుపు తీస్తుంది. అప్పుడే రాజ్ వచ్చి.. నేను.. ఏం చేస్తున్నావ్? అని అడుగుతాడు. అప్పుడే శ్వేత రాజ్‌ని హగ్ చేసుకుంటుంది. ఏమైంది? ఎందుకు అలా కంగారు పడుతున్నావ్? అని రాజ్ అడగ్గా.. ఇంట్లో ఎవరో ఉన్నారు రాజ్.. కంగారుగా ఉంది అని అంటుంది శ్వేత. సరే వెళ్లి చూద్దాం అని రాజ్, శ్వేతలు వెళ్లి చూస్తారు. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావ్? అని రాజ్ అంటే.. లేదు ఎలా రాజ్? నేను బెడ్ రూమ్‌లో పడుకున్నా కానీ టీవీ ఆన్ అయింది ఎలా అని అంటుంది శ్వేత. నువ్వు టీవీలో రిమైండర్ పెట్టుకున్నట్టు ఉన్నావ్ అని రాజ్ చెప్తాడు. శ్వేత అవునా..

Brahmamudi, January 19th episode:  కన్నీరుమున్నీరైన కావ్య.. రుద్రాణితో కలిసి అనామిక కొత్త ప్లాన్!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. శ్వేత కొట్టడానికి తలుపు తీస్తుంది. అప్పుడే రాజ్ వచ్చి.. నేను.. ఏం చేస్తున్నావ్? అని అడుగుతాడు. అప్పుడే శ్వేత రాజ్‌ని హగ్ చేసుకుంటుంది. ఏమైంది? ఎందుకు అలా కంగారు పడుతున్నావ్? అని రాజ్ అడగ్గా.. ఇంట్లో ఎవరో ఉన్నారు రాజ్.. కంగారుగా ఉంది అని అంటుంది శ్వేత. సరే వెళ్లి చూద్దాం అని రాజ్, శ్వేతలు వెళ్లి చూస్తారు. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావ్? అని రాజ్ అంటే.. లేదు ఎలా రాజ్? నేను బెడ్ రూమ్‌లో పడుకున్నా కానీ టీవీ ఆన్ అయింది ఎలా అని అంటుంది శ్వేత. నువ్వు టీవీలో రిమైండర్ పెట్టుకున్నట్టు ఉన్నావ్ అని రాజ్ చెప్తాడు. శ్వేత అవునా ఆలోచనలో ఉంటుంది. అప్పుడే శృతి.. కావ్యకి కాల్ చేసి.. రాజ్ సార్ ఉన్నారా? అని అడుగుతుంది. అదేంటి? ఆఫీస్‌కి వచ్చారు కదా.. అని కావ్య అంటే.. లేదు ఇంకా రాలేదు. రేపు మార్నింగ్ వరకు డిజైన్స్ కంప్లీట్ అవ్వాలి అన్నారు అని శృతి అంటే.. నాకు కూడా అదే చెప్పి ఆఫీస్‌కి వచ్చారని శృతి అంటుంది. సరే నాకు ఆ డిజైన్స్ నాకు పంపించు.. ఫినిష్ చేసి పంపిస్తాను అని చెప్తుంది శృతి. సరే అని అంటుంది శృతి. ఆఫీస్‌కి అని చెప్పి ఎక్కడికి వెళ్లారు అని కావ్య ఆలోచనలో పడుతుంది.

శ్వేతకు ధైర్యం చెప్పిన రాజ్..

ఈ సీన్ కట్ చేస్తే.. ఇంట్లోకి ఎవరో వచ్చారు అని శ్వేత కంగారు పడుతుంది. సరే ఎవరో వచ్చారని నువ్వు ఎలా నమ్ముతున్నావ్ అని రాజ్ అంటాడు. ఇక్కడ పెట్టిన ఫ్లవర్ వాజ్ కింద ఎలా పడింది. ఇందాక కింద పడినది నేనే పైన పెట్టాను. అంటే అదేదో.. అని రాజ్ అనబోతే.. గాలికి పడింది అంటావ్. అంతేకదా.. పదా చూడు స్టాండ్‌లో ఉండే కత్తి కింద ఎలా పడింది? అది కూడా గాలికే పడిందా.. నా చుట్టూ ఏదో జరుగుతుంది రాజ్. తెలీడం లేదు పిచ్చి ఎక్కిపోతుంది నాకు అని శ్వేత అంటే.. రిలాక్స్.. నేను కనుక్కుంటాను అని రాజ్ ధైర్యం చెప్తాడు.

శ్వేత, రాజ్‌లను చూసి బాధతో కన్నీరు మున్నీరైన కావ్య..

ఈలోపు కావ్య వేసిన డిజైన్స్.. శ్వేతకు పంపిస్తుంది. అప్పుడే శ్వేత కాల్ చేస్తుంది. మీరు పంపించిన డిజైన్స్ చాలా బావున్నాయని శ్వేత అనగా.. వాటిని డిలీట్ చేసేయ్. నేను మళ్లీ వేరే డిజైన్స్ పంపిస్తాను అని కావ్య అంటే.. ఇంత కష్టపడి వేసినవి డిలీట్ చేసేయాలా.. అందులో కొన్ని లోపాలు ఉన్నాయి. అయినా ఎంత కష్ట పడ్డాము అన్నది ముఖ్యం కాదు.. క్లయింట్స్ కి నచ్చాయా లేదా అన్నది ఇంపార్టెంట్ అని కావ్య అంటుంది. ఆ తర్వాత సర్ ఏమన్నా కాల్ చేశారా అని శ్వేత అడుగుతుంది. లేదని శ్వేత చెప్తుంది. ఈ టైమ్ వరకు ఏం చేస్తున్నారు.. ఎక్కడికి వెళ్లారు అని మనసులో అనుకుంటుంది కావ్య. అప్పుడే కావ్యకు ఓ ఫొటో వస్తుంది. అది చూసిన కావ్య.. షాక్ అవుతుంది. ఆ తర్వాత పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ బాధ పడుతుంది కావ్య.

ఇవి కూడా చదవండి

బావగారు ఆఫీస్‌కి వెళ్తే నువ్వేం చేస్తావ్ అని కళ్యాణ్‌ని అడిగిన అనామిక..

ఈ సీన్ కట్ చేస్తే.. కళ్యాణ్‌కు టీ తీసుకొస్తుంది అనామిక. ఏంటి కళ్యాణ్.. బావగారు ఆఫీస్‌కి వెళ్లారు.. నువ్వు వెళ్లవా.. రోజూ ఏం చేస్తూ ఉంటావ్ అని అనామిక అడిగితే.. ఏం చేస్తాడు అనామిక.. ఆ పిచ్చి రాతలు రాస్తూ కూర్చుంటాడు. ఏం చేస్తాం చెప్పు.. మొత్తం రాజ్ చేతుల్లోనే ఉంది. నన్ను ఆఫీస్‌కి రానివ్వడు. కళ్యాణ్‌ని అవసరం ఉంటే తప్ప పిలవడు ఏంటో అని చెప్పి వెళ్లి పోతాడు. చూశావా అనామిక నావి పిచ్చిరాతలు అంటూ ఉంటారు. కానీ నువ్వు మాత్రమే నా కవితల్ని గుర్తు పెట్టింది నువ్వే అని కళ్యాణ్ అంటే.. నువ్వు ఇలా ఇంట్లో కూర్చుని కవితలు రాస్తూ ఉంటే.. భార్యగా నాకేం విలువ ఉంటుందని అనామిక ఆలోచనలో పడుతుంది.

రుద్రాణితో కలిసి అనామిక ప్లాన్.. నేనే గెలుస్తా అంటూ ఛాలెంజ్..

అప్పుడే రుద్రాణి.. అనామికకు ఎదురు పడుతుంది. నీ పెయిన్ నాకు తెలుసు అనామిక.. కళ్యాణ్ అలా ఇంట్లో ఉంటే.. అక్కడ రాజ్ రాజ్యం ఏలుతున్నాడనే కదా నీ బాధ. అవును ఆంటీ ఏ భార్యకు అయినా తన భర్తకు విలువ ఇవ్వాలని కోరుకుంటుంది కదా.. అదే నేను కూడా మొత్తుకుంటున్నా.. అందరూ రాజ్‌ని రాజులా చేస్తున్నారు కానీ.. రాహుల్, కళ్యాణ్‌లను మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. మరి మా అత్తయ్య గారు ఎందుకు చూస్తూ ఉరుకున్నారని అనామిక అంటుంది. అది ఇప్పటివరకూ జరిగిందేమో.. కానీ ఇకపై కుదరదని అనామిక అంటుంది. ఏం చేస్తావ్ అని రుద్రాణి అడిగితే.. మీరు సహాయం చేస్తానంటే నేను దాన్ని మారుస్తా.. మీరు మా అత్తయ్య గారి దగ్గరకు వెళ్లి నేను చెప్పినట్టు చెప్పండి అని అనామిక ప్లాన్ చెబుతుంది. నువ్వు చెప్పినట్టే చేస్తాను.కొత్త కోడలివిగా నువ్వేమన్నా గెలుస్తావేమో చూస్తాను అని అంటుంది రుద్రాణి. తప్పకుండా నేనే గెలుస్తా అని అనామిక అంటుంది.

కళ్యాణ్‌కి బిజినెస్ అప్పజెప్పమని అడుగు..

కావ్య టీ పెట్టి ఇందిరా దేవి, అపర్ణ, రుద్రాణి, ధాన్య లక్ష్మిలకు ఇస్తుంది. అప్పుడే రాజ్ వస్తాడు. ఎక్కడికి వెళ్లావ్? అని అపర్ణ అడిగితే.. ఆఫీస్‌కి వెళ్లారు అని అంటుంది. రాత్రంతా అక్కడే ఉన్నావా.. అని అపర్ణ అడిగితే కావ్యనే సమాధానం ఇస్తుంది. కావ్య వైపు చూస్తాడు రాజ్. మధ్యలో ధాన్య లక్ష్మి రాజ్ నువ్వు వెళ్లు.. ఫ్రెష్ అయి తిని రెస్ట్ తీసుకో అంటుంది. రాజ్ పైకి వెళ్తాడు. అప్పుడే కళ్యాణ్ చేతికి కూడా పగ్గాలు అప్పజెప్పమని అడుగు.. ఇప్పుడు పెళ్లి అయింది కదా.. అనామిక ఫీల్ అవుతుంది కదా అని ధాన్య లక్ష్మికి చెప్తుంది రుద్రాణి.

నన్ను అర్థం చేసుకుందా.. అనుమానిస్తుందా.. ఆలోచనలో రాజ్

రాజ్ పైకి బెడ్ మీద పడుకుంటాడు. అప్పుడే శృతి కాల్ చేస్తుంది. అది చూసి రాజ్ కంగారు పడతాడు. అప్పుడే కావ్య.. గీసిన డిజైన్స్ ఇస్తుంది. రుద్రా గ్రూప్ వాళ్లకు మీరు ఇవ్వాల్సిన డిజైన్స్ అని కావ్య ఇస్తుంది. నీకెలా తెలుసు? అని రాజ్ అడిగితే.. నాకు అన్నీ తెలుసు అని అంటుంది కావ్య. ఏమన్నా అడగాలా అని రాజ్ అడిగితే.. చెప్పడానికి ఏమీ లేదని రాజ్ అంటాడు. సరే అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది కావ్య. వెంటనే శృతికి కాల్ చేసి చివాట్లు పెడతాడు రాజ్. నేను ఆఫీస్‌కి వెళ్లలేదు. ఆ విషయం తెలిసింది. అయినా అడగలేదు. అర్థం చేసుకుందా.. లేక అనుమానిస్తుందా అని ఆలోచనలో పడతాడు రాజ్.