Brahmamudi, April 1st episode: బిడ్డ కోసం కంపెనీ వదులుకున్న రాజ్.. కుర్చీ కోసం ఫైట్ షురూ..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ బిడ్డ కోసం కావ్య బొమ్మలు తీసుకెళ్తూ ఉంటుంది. అంతలోనే కనకం, కృష్ణమూర్తిలు ఎదురు పడతారు. కావ్య చేతిలో బొమ్మలను చూసి కనకం, కృష్ణమూర్తిలు షాక్ అవుతారు. చూశారా మీ కూతురు తన జీవితాన్నే త్యాగం చేస్తుంది. అతనికి పుట్టిన బిడ్డ కోసం బొమ్మలు కొనుక్కెళ్తుంది. ఏంటే ఈ పరిస్థితి అని కనకం బాద పడుతుంది. నిన్ను ఆ రోజే ఇంట్లో నుంచి వచ్చేమన్నాం. కానీ వాళ్లను నిలదీస్తానన్నావ్.. ప్రశ్నిస్తానన్నావ్.. దుగ్గిరాల వారు ఏం సమాధానం చెప్తారో..

Brahmamudi, April 1st episode: బిడ్డ కోసం కంపెనీ వదులుకున్న రాజ్.. కుర్చీ కోసం ఫైట్ షురూ..
Brahmamudi
Follow us

|

Updated on: Apr 01, 2024 | 12:13 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ బిడ్డ కోసం కావ్య బొమ్మలు తీసుకెళ్తూ ఉంటుంది. అంతలోనే కనకం, కృష్ణమూర్తిలు ఎదురు పడతారు. కావ్య చేతిలో బొమ్మలను చూసి కనకం, కృష్ణమూర్తిలు షాక్ అవుతారు. చూశారా మీ కూతురు తన జీవితాన్నే త్యాగం చేస్తుంది. అతనికి పుట్టిన బిడ్డ కోసం బొమ్మలు కొనుక్కెళ్తుంది. ఏంటే ఈ పరిస్థితి అని కనకం బాద పడుతుంది. నిన్ను ఆ రోజే ఇంట్లో నుంచి వచ్చేమన్నాం. కానీ వాళ్లను నిలదీస్తానన్నావ్.. ప్రశ్నిస్తానన్నావ్.. దుగ్గిరాల వారు ఏం సమాధానం చెప్తారో చూస్తానన్నావ్. ఇప్పుడు మేము చూసేది పూర్తిగా భిన్నంగా ఉందేంటి? అమ్మా అని కృష్ణ మూర్తి అంటాడు. డబ్బు ఉన్నవాళ్లు అందరూ ఇంతే. అడిగితే హక్కు లేదు పొమ్మంటారు. న్యాయం కోసం పోరాడుతామని మేము ధైర్యంగా ఉంటే.. నువ్వు ఇప్పుడు చేసేది ఏంటి? అంటే ఈ బతుక్కి అలవాటు పడిపోయావా.. సర్దుకు పోతున్నావా.. ఇలాంటి మోసగాడిని నువ్వు ఎలా క్షమించావ్? పది మందిలో పంచాయతీ పెట్టించి.. న్యాయం కోసం కోర్టుకు ఈడ్చి ఏదో ఒకటి చేయకంటే.. ఆ పచ్చి మోసగాడిని అలానే వదిలేస్తావా? పదా ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. కోర్టుకు ఈడ్చి నిజాన్ని బయట పెడదాం. నీ మొగుడిని వీధిలోకి లాగుదాం అంటూ కనకం ఆవేశంగా అంటుంది.

నిజం రుజువు అయితే.. నేను ఆ ఇంటి నుంచి వచ్చేస్తా..

ఇంకా.. నా భర్త మానమర్యాదల్ని మంట గలపడానికి ఇవి సరిపోతాయా.. ఇంకా ఏమన్నా మిగిలిపోయాయా? నిజమేనమ్మా.. మా ఆయనికి ఇలాంటి శిక్షలున్నీ వేయాల్సిందే. ఎందుకంటే ఆయన మీకు చాలా అన్యాయం చేశారు కదా. అంటూ పుట్టింటికి రాజ్ చేసిన ప్రతీ ఒక్క మంచి పని గురించి తల్లిదండ్రులకు చెబుతుంది కావ్య. అంతా బావుంటే అల్లుడు దేవుడు. అటూ ఇటూ అయితే మోసగాడు. అయినా ఎదుటి వాళ్లు తప్పు చేస్తే.. ఆ మూలాల్లో నుంచి ఆలోచించి క్షమిస్తారమ్మా. మీకు మంచి జరిగినప్పుడు పొగిడి.. ఇప్పుడు నష్టం జరిగినప్పుడు శత్రువులా చూస్తారా? ఇది న్యాయమేనా? ఇవన్నీ నేను రాజీ పడి చేయడం లేదు. ఇన్ని గొప్ప గుణాలున్న మనిషి.. వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చి వెలివేస్తే.. అసలు మనం మనుషులం అనిపించుకోం. అసలు నిజం తెలియకుండా నిందలు వేయకూడదు. కాబట్టి ఆ నిజం బయట పడేంత వరకూ ఎదురు చూస్తాను. నిజంగానే ఆయన జీవితంలో ఇంకో ఆడది ఉంటే.. తప్పకుండా నేను ఆ ఇంటి గడప దాటి ఇంటికి వచ్చేస్తా. అప్పుడు నాకు మీరు ఆశ్రయం ఇవ్వండి. నాకో ముద్ద పెట్టండి. కానీ అప్పటి వరకూ మా ఆయన్ని ఎవరైనా ఏమన్నా ఉంటే అస్సలు ఊరుకోను అని చెబుతుంది కావ్య.

రాజ్‌ని నిలదీసిన ఇందిరా దేవి..

ఈ సీన్ కట్ చేస్తే.. రాజ్ కోసం అందరూ హాలులో ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో రాజ్ ఇంటికి వస్తాడు. నీతో మాట్లాడకూడదని ఓ శాసనం. కానీ మాట్లాడక తప్పని సమయం అని అపర్ణ అంటే.. మాటలే కదా.. పోయేది ఏముందని రాజ్ అంటే.. ఈ ఇంటి పరువు పోయింది. ఈ ఇంటి పరువును భుజాన్న వేసుకుని వెళ్లావ్.. ఆ పరువు మోయలేనంతగా పోయింది. అందుకే ఆ బరువును దింపుకోమని చెప్పాను. నేను ఈ బరువును దింపుకోలేను అని రాజ్ చెప్తాడు. అంటే నువ్వు ఆఫీస్‌కి బిడ్డను తీసుకునే వెళ్తావా? అని ఇందిరా దేవి అడుగుతుంది. తప్పదు అని రాజ్ చెప్తాడు. ఆఫీసులో ఆ బిడ్డ ఎవరు అని చెబితే ఏం చెప్తావ్? ఆ బిడ్డకు తల్లి ఎవరు అని చెప్తే ఏం సమాధానం ఇస్తావ్? అని పెద్దావిడ నిలదీస్తుంది. నా బిడ్డే అని చెప్తాను అని రాజ్ అంటాడు. నువ్వు నిజం చెప్పావ్.. ఆ బిడ్డకు తల్లి ఎవరో చెప్పవు. కానీ నువ్వు చేసేది చేస్తూనే ఉంటున్నావ్. ఆ బిడ్డను ఆఫీస్ వరకూ తీసుకెళ్లడం నేరం. దానికి నీ సంజాయిషీ ఏంటి అని అపర్ణ అడుగుతుంది. ఈ ఇంట్లో బిడ్డను అనాథలా వదిలేసి రావాల్సి వచ్చిందని తీసుకెళ్లాను అని రాజ్ అంటాడు.

ఇవి కూడా చదవండి

అపర్ణను నిలదీసిన రుద్రాణి..

ఇంతలో రుద్రాణి ఎంటరై.. నీకు ఇంకా అర్థం కాలేదా వదినా? బిడ్డతో నట్టింట్లోనే అడుగు పెట్టాడు. లీగల్‌గా పుట్టినట్లు ఇళ్లంతా తిప్పుతూనే ఉన్నాడు. వాడికి ఎలాంటి సహకారాలు అందించకూడదు అన్నారు. కానీ వాడి పెళ్లామే పాలూ, ఉగ్గు అందిస్తోంది. మీరు నిలదీసినా.. వాడి నిర్ణయం మారదని అంటున్నాడు. ఇంతటితో ఈ రభస పూర్తి అవుతుంది. వారసత్వం వాకర్‌లో ఇళ్లంతా తిరుగుతూనే ఉంటుంది. అంతేనా? ఇక ఈ సమస్యకు అంతమే లేదా అని రుద్రాణి అడుగుతుంది. ఒకప్పుడు నా కొడుకు అసమర్థుడని.. అమ్మాయిలతో తిరుగుతున్నాడని.. వాడిని ఆఫీస్‌లో అడుగు పెట్టకుండా చేశారు. ఇప్పుడు వదినా మీ కొడుకు ఏం సమర్థత వెలగబెట్టాడు. మరి రాజ్ చేసింది రైట్ అయితే నా కొడుకు చేసింది కూడా రైటే. రాహుల్‌కి కంపెనీ చూసుకునే హక్కు లేనప్పుడు.. రాజ్‌కి కూడా ఆ అర్హత ఉండదు అని నిలదీస్తుంది రుద్రాణి.

కంపెనీ బాధ్యతలను వదిలేసుకోవాలి..

రుద్రాణి మాటలతో అపర్ణా దేవి అహం మరింత దెబ్బ తింటుంది. విన్నావా ఎవరి మాటకైనా జవాబు చెప్పే ధైర్యం నీకు ఉందా? రుద్రాణి ఎప్పుడు మాట్లాడినా ఖండించే నేను.. ఈ రోజు ఈవిడను ఆపలేకపోతున్నా. ఈ ఇంట్లో ఎవరూ నిన్న వెనకేసుకు రాలేకపోతున్నారు. నీకు రెండే పరిష్కారాలు ఉన్నాయి. చేసిన తప్పుకు పశ్చాత్తాపంగా బిడ్డను వదిలేసి రావాలి. లేదు అంటే దీనికి పరిహారంగా నువ్వు కంపెనీ బాధ్యతలు వదిలేసుకోవాలి అని చెబుతుంది అపర్ణ. ఇది విన్న సుభాష్.. అపర్ణా నువ్వు ఏం మాట్లాడుతున్నావ్? అందంత సులువు అనుకుంటున్నావా? రాజ్ అడుగు పెట్టిన తర్వాత సంవత్సరంలోనే కంపెనీ టర్నోవర్ పెరిగింది. ఇప్పుడు అదంతా తలకిందులై పోతాయని అంటాడు.

కంపెనీ బాధ్యతలను వదిలేసుకున్న రాజ్..

మీరు వ్యాపారంలో కలిగే లాభనష్టాల గురించి మాట్లాడుతున్నారు. కానీ నేను ఈ ఇంటి కోడలిగా.. ఇంటికి జరిగే లాభనష్టాల గురించి చర్చిస్తున్నా అని అపర్ణ అంటుంది. అపర్ణ మాటలను ధాన్య లక్ష్మి కూడా సమ్మతిస్తుంది. అక్కడ ఇచ్చిన తీర్పే సరైనది. బిడ్డను వదిలెయ్యాలి లేదా కంపెనీని వదిలెయ్యాలి అని ధాన్య లక్ష్మి అంటుంది. ఏం చెప్పాలి మమ్మీ.. అధికారం కోసం రక్త బంధాన్ని వదులు కోవాలా? అసలు ఈ నియమంతో నాకు పని లేదు. ఎందుకంటే నాలో పశ్చాత్తాపం లేదు. పరిహారం చెల్లించడానికి భయమూ లేదు. కాబట్టి సంతోషంగా కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటాను. అలాగే ఈ ఇంట్లో నేను ఉండాలో లేక అది కూడా నిర్ణయం తీసుకుని చెప్పండి అని చెప్పి వెళ్లిపోతాడు రాజ్. దీంతో రుద్రాణి, అనామిక సంతోష పడతారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌తో కలుద్దాం.

యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు
గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు
గాయాలతో ఏనుగుపిల్ల మృతి.. తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏంచేసిందంటే.!
గాయాలతో ఏనుగుపిల్ల మృతి.. తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏంచేసిందంటే.!