Bigg Boss: నా భార్య గురించి మాట్లాడతావా.. కంటెస్టెంట్ చెంప పగులగొట్టిన మరో కంటెస్టెంట్..

|

Jul 07, 2024 | 9:44 PM

నార్త్ లో ఈ షోను ఆదరించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటివరకు టీవీలో మొత్తం 17 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. అలాగే అటు ఓటీటీలోనూ ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం హిందీలో బిగ్‏బాస్ ఓటీటీ సీజన్ 3 నడుస్తోంది. అయితే ఈసారి హౌస్ లోకి ఇద్దరు భార్యలతో అడుగుపెట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు అర్మాన్ మాలిక్.

Bigg Boss: నా భార్య గురించి మాట్లాడతావా.. కంటెస్టెంట్ చెంప పగులగొట్టిన మరో కంటెస్టెంట్..
Armaan Malik
Follow us on

హిందీలో బిగ్‏బాస్ రియాల్టీ షోకు మంచి రేటింగ్ ఉంటుంది. నార్త్ లో ఈ షోను ఆదరించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటివరకు టీవీలో మొత్తం 17 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. అలాగే అటు ఓటీటీలోనూ ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం హిందీలో బిగ్‏బాస్ ఓటీటీ సీజన్ 3 నడుస్తోంది. అయితే ఈసారి హౌస్ లోకి ఇద్దరు భార్యలతో అడుగుపెట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు అర్మాన్ మాలిక్. అయితే మొదట్లో ఈవిషయంపై బిగ్‏బాస్ నిర్వాహకులపై అడియన్స్ మండిపడ్డారు. సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామని ఇద్దరు భార్యలు ఉన్న వ్యక్తిని తీసుకువస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా కడిగిపారేశారు. ఇదంతా పక్కన పెడితే ఇటీవలే ఈ షో నుంచి అర్మాన్ మాలిక్ మొదటి భార్య పాయల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. కానీ ఆమెను మళ్లీ వీకెండ్ కా వార్ ఎపిసోడ్ లో సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు.

ఇక వచ్చిరావడంతోనే లోపల ఉన్న కంటెస్టెంట్స్ పై విరుచుకుపడింది. ముఖ్యంగా యూట్యూబర్ విశాల్ తీరుపై మండిపడింది. అర్మాన్ రెండో భార్య కృతిక వదిన చాలా బాగుందని.. ఆమె అంటే చాలా ఇష్టమని మరో కంటెస్టెంట్ చెవిలో మాట్లాడాడు విశాల్. ఇక ఇది బయటి నుంచి చూసిన పాయల్ ఇంట్లోకి వెళ్లాక అతడిపై సీరియస్ అయ్యింది. నువ్వు ఒక తల్లి గురించి.. ఒకరి భార్య గురించి మాట్లాడుతున్నావు. ఆ విషయం తెలుసుకుని కాస్త మర్యాదగా మాట్లాడు.. కృతిక గురించి అలా అనడం తప్పు అంటూ సీరియస్ అయ్యింది. అయితే ఈ విషయంపై విశాల్ మాట్లాడుతూ.. తనకు ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదని.. కేవలం సరదాగానే చెప్పానని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. తప్పుడు ఉద్దేశ్యం లేకపోతే నేరుగా వెళ్లి తనకే చెప్పొచ్చు కదా అంటూ పాయల్ ప్రశ్నించింది. ఇక ఇదంతా విన్న పాయల్ భర్త అర్మాన్ కోపంగా విశాల్ మీదకు వచ్చాడు.

ఇద్దరి మధ్య మాట మాట పెరిగి కొట్టుకునేంత వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే విశాల్ చెంప పగులగొట్టాడు అర్మాన్. దీంతో మిగతా కంటెస్టెంట్ ఇద్దరిని చెరో పక్కు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతుండగా.. విశాల్ కు మద్దతు తెలుపుతున్నారు నెటిజన్స్. అందంగా ఉందని చెప్పడం కూడా తప్పేనా ? అయినా వదినా అని అన్నాడు కదా.. అందులో తప్పేంటీ ? అంటూ మండిపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.