Bigg Boss 8 Telugu Promo 3: గేమ్ తక్కువ మాటలేక్కువ.. విష్ణుప్రియను టార్గెట్ చేసిన సోనియా.. పాపం నిఖిల్..

|

Sep 12, 2024 | 7:39 PM

విష్ణు ఏమాత్రం ఎమోషనల్ కాకుండా మాటకు మాట తిప్పికొట్టింది. ఆ తర్వాత జరిగిన స్విమ్మింగ్ ఫూల్ టాస్కులో సోనియా బొక్క బోర్లా పడిపోయింది. కానీ అదే టాస్కులో విష్ణు గెలిచి సత్తా చాటింది. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో తనకు సంబంధమే లేని విషయంలో తలదూర్చి మరీ విష్ణు పై మాటలతో రెచ్చిపోయింది సోనియా.

Bigg Boss 8 Telugu Promo 3: గేమ్ తక్కువ మాటలేక్కువ.. విష్ణుప్రియను టార్గెట్ చేసిన సోనియా.. పాపం నిఖిల్..
Bigg Boss 8 Telugu Promo 3
Follow us on

సోనియా ఆకుల.. ఇప్పుడు ఈ పేరు వింటేనే మండిపడుతున్నారు నెటిజన్స్. బిగ్‏బాస్ సీజన్ 8 ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు మాటలు తప్ప ఆట కనిపించడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరైనా మాట్లాడితే ఏడ్చేయడం.. లేదంటే విష్ణుప్రియపై పడి ఏడవడం మాత్రం చేస్తుందని.. సోనియా పై మండిపడుతున్నారు. ఇక హౌస్ లో ఆమె చేసిన పని కూడా అలాగే ఉందనుకోండి. నామినేషన్స్ సమయంలో విష్ణును దారుణంగా అవమానించింది సోనియా. అయినా విష్ణు ఏమాత్రం ఎమోషనల్ కాకుండా మాటకు మాట తిప్పికొట్టింది. ఆ తర్వాత జరిగిన స్విమ్మింగ్ ఫూల్ టాస్కులో సోనియా బొక్క బోర్లా పడిపోయింది. కానీ అదే టాస్కులో విష్ణు గెలిచి సత్తా చాటింది. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో తనకు సంబంధమే లేని విషయంలో తలదూర్చి మరీ విష్ణు పై మాటలతో రెచ్చిపోయింది సోనియా.

తాజాగా విడుదలైన ప్రోమోలో ఆరవ ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‏బాస్. ఆ టాస్కు విలువ లక్ష రూపాయాలు. ఈ గేమ్ లో పోటీదారులు ఓ బాక్స్ లో నిలబడి కాళ్లకు సాక్స్ వేసుకోవాలి. ఎవరయితే చివరి వరకు సాక్స్ లు కాళ్లకు ఉండేలా చూసుకుంటారో వాళ్లే విజేతలు అని చెప్పేశారు. ఈ గేమ్ కు సంచాలక్ ప్రేరణ. ఇక ఈ గేమ్ లో పృథ్వీ, విష్ణు ప్రియ, అభయ్, మణికంఠ, నిఖిల్, నబీల్ పోటీపడ్డారు. ఈ గేమ్ మొదలైన కాసేపటికి లైన్ టచ్ చేయడంతో మణికంఠ, పృథ్వీ ఔట్ అంటూ సంచాలక్ ప్రేరణ చెప్పేసింది. ఆ తర్వాత విష్ణుప్రియను అభయ్ టచ్ చేశాడంటూ నైనిక టీమ్ అరవడంతో నేను చేయలేదు.. చేశానంటే ఇక్కడి నుంచి వెళ్లిపోతా అంటూ అభయ్ అరిచాడు. కాసేపటికి విష్ణు ఔట్ అంటూ సోనియా స్టార్ట్ చేసింది. లేదు ఔట్ కాదంటూ విష్ణు వాదిస్తున్నప్పటికీ కాదు.. బయటకు రా.. మీ టీమ్ వాళ్లకు అడిగితే అబద్ధమే చెబుతారు కదా అంటూ రచ్చ స్టార్ట్ చేసింది.

ఇక ఆ తర్వాత అభయ్ కాలును తోసేసిందంటూ విష్ణును ఔట్ చేయగా.. నేను రానంటూ వాదించింది విష్ణు. ఇక సంచాలక్ ప్రేరణ కంటే ఎక్కువగా రెచ్చిపోయింది సోనియా. పక్కనే కాలు మీద కాలు వేసుకుని కూర్చొని.. ఔట్ అయ్యాక కూడా గ్రౌండ్ లో ఎందుకుంటావ్ బయటకు రా అంటూ అరిచింది. ఆ తర్వాత నబీల్ ఔట్ కాగా.. చివరగా అభయ్, నిఖిల్ మాత్రమే మిగిలారు. చివరకు నిఖిల్ కాలు మీద అభయ్ గట్టిగా తొక్కడంతో బాధతో విలవిలలాడిపోయాడు. ఇక ఎప్పటిలాగే ఈ ప్రోమోలోనూ విష్ణుప్రియను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది సోనియా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.