Bigg Boss 5 Telugu: అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి.. మిగిలిందే ఆ ముగ్గురే.. సింగిల్స్‏ను అందుకే పంపారంటూ లహరి షాకింగ్ కామెంట్స్..

బిగ్‏బాస్ 5 సీజన్ మొదటి రోజు ఆసక్తికరంగా సాగింది. పరిచయాలు, అల్లరి పనులతో అంత సరదగా గడిపారు. ముచ్చట్లు.. ఫన్సీ కామెంట్స్ చేస్తూ

Bigg Boss 5 Telugu: అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి.. మిగిలిందే ఆ ముగ్గురే.. సింగిల్స్‏ను అందుకే పంపారంటూ లహరి షాకింగ్ కామెంట్స్..
Lahari

Edited By:

Updated on: Sep 12, 2021 | 5:02 PM

బిగ్‏బాస్ 5 సీజన్ మొదటి రోజు ఆసక్తికరంగా సాగింది. పరిచయాలు, అల్లరి పనులతో అంత సరదగా గడిపారు. ముచ్చట్లు.. ఫన్సీ కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు హౌస్ మేట్స్. అయితే లోబో తన గురకతో కంటెస్టెంట్లతో మొదటి రోజే శివరాత్రి చేసాడు. గురకను ఆపేందుకు కంటెస్టెంట్స్ అందరూ శతవిధాలుగా ప్రయత్నించారు. ఇక ఆ తర్వాత జెస్సీ, హమిద, శ్వేతా కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటూ కనిపించారు. ఈ సీజన్‏లో కనిపించిన ఫస్ట్ డిస్కషన్ వీళ్లదే. ఇక ఉదయాన్నే సిరి, జెస్సీలు బోర్ కొడుతుందంటూ.. మిగతా సభ్యుల వస్తువులను దొంగతనం చేయడం.. హౌస్ట్ మేట్స్ వాటిని వెతికే పనిలో పడడం ఫన్నీగా సాగింది. అయితే ఇంట్లో వారి వస్తువులను దాచేసి ఏం తెలియనట్లుగా నాటకం ఆడుతున్న సిరి, జెస్సీలను యాంకర్ రవి పడిగట్టేస్తాడు. దీంతో తామేదొంగతనం చేసినట్లుగా ఒప్పుకుంటారు.

మరోవైపు.. తమ గురించి పూర్తిగా మిగతా కంటెస్టెంట్లతో చెప్పుకుంటూ.. వారిని వారు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇందులో ప్రధానంగా లహరి, కాజల్‏ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. పెళ్లి ఎప్పుడు అంటూ లహరిని అడిగింది కాజల్. దీంతో లహరి స్పందిస్తూ.. ఇంకా ఏం అనుకోవడం లేదని చెప్పడంతో.. వెంటనే ఎవరినైనా ప్రేమిస్తున్నావా ? అంటూ తిరిగి ప్రశ్నించింది కాజల్. దీంతో లేదు అని చెబుతుంది లహరి. అయితే ఈ ఇంట్లో ఎవరితోనైనా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా ? అంటూ ప్రశ్నించింది కాజల్. అయితే ఇక్కడ కనెక్ట్ ఫీల్ ఎవరితో రాలేదని చెప్పుకొచ్చింది కాజల్.. సన్నీ తనకు ముందే తెలుసని.. బ్రోలాగా అంటూ చెప్పుకొచ్చింది. ఇక అందరూ పెళ్లిళ్లు అయిపోయినవారు ఉన్నారని చెప్పుకొచ్చింది. కేవలం మిగిలింది సన్నీ, శ్రీరామ్, జెస్సీలు మాత్రమే ఉన్నారు. చూద్దాం అని అనడంతో హౌస్‏లోకి సింగిల్స్‏ను పంపాల్సింది అని కాజల్ అంది. అయితే సింగిల్స్ కోసం సింగిల్స్‏ను పంపారని చెప్పింది లహరి.

Also Read: Bigg Boss 5 Telugu: మూడేళ్లుగా మోసం చేస్తూనే ఉన్నా.. మరోసారి సెన్సెషనల్ కామెంట్స్ చేసిన ప్రియాంక..

Bigg Boss 5 Telugu: సీరియస్.. ఎమోషనల్‍గా నామినేషన్ ప్రాసెస్.. ఎలిమినేషన్ జోన్‏లోకి ఆరుగురు సభ్యులు ..

Loading...
Unable to load recommendations.
Follow Us