Bigg Boss 5 Telugu: ప్రియా వ్యాఖ్యల కలకలం.. బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతున్న ఎడమొఖం- పెడమొఖం..

బిగ్ బాస్ సీజన్ 5 రసావత్రరంగా సాగుతుంది. గత సీజన్స్ కంటే ఈ సీజన్ లో గొడవలు, ఏడుపులు, అల్లర్లు, గొడవలతో నానా హంగంగా సాగుతుంది.

Bigg Boss 5 Telugu: ప్రియా వ్యాఖ్యల కలకలం.. బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతున్న ఎడమొఖం- పెడమొఖం..
Bigg Boss

Updated on: Sep 21, 2021 | 12:38 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 రసావత్రరంగా సాగుతుంది. గత సీజన్స్ కంటే ఈ సీజన్ లో గొడవలు, ఏడుపులు, అల్లర్లు, గొడవలతో నానా హంగంగా సాగుతుంది. ఇక సోమవారం ఎపిసోడ్‌లో ప్రియా చేసిన వ్యాఖ్యలు కలకలం కొనసాగుతుంది. లహరి- రవిని టార్గెట్ చేసి ప్రియా చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపాయి. దాంతో ప్రియా కు లహరి మధ్య చిన్న సైజ్ వారే నడిచింది. ఇక ఈ వ్యవహారంలో రవిని లాగడంతో ఈ రచ్చ మరింత పెద్దదైంది. లహరి -రవి మిడ్ నైట్ రెస్ట్ రూమ్‌లో కౌగిలించుకున్నారంటూ ప్రియా చెప్పడంతో హౌస్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దాంతో లహరి ప్రియా పై వాగ్వాదానికి దిగింది. ఆతర్వాత సీన్‌లోకి వచ్చిన రవి కూడా.. ప్రియా పై అరిచేశాడు. వెంటనే రవి అందుకొని ఏంటక్కా ఏమాట్లాడుతున్నావ్ అంటూ ప్రశ్నించాడు. దానికి ‘మీరు హగ్ చేసుకున్నది మిడ్ నైట్ కాదా? టాయ్ లెట్‌లో కాదా? అని తిరిగి ప్రశ్నించింది ప్రియ. ఆ తర్వాత మరో సారి ప్రియా నోరు జారింది. నీకు ఇంతకు ముందు కూడా చెప్పా.. ఆమె సింగిల్ ఏమైనా చెయ్యొచ్చు కానీ నువ్వు అలా కాదు అని అంది ప్రియా.. దాంతో రవి సహనం కోల్పోయాడు..

ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఈ రచ్చ హౌస్‌లో ఇంకా కొనసాగుతుందని చూపించారు. లహరి రవి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ.. నేను యాంకరింగ్ కోసం ట్రై చేస్తున్నాను.. అందుకని నేను నీవెనకాల పడుతున్నానని ఆమె అనుకుంటుంది అంటూ లహరి రవికి చెప్పుకొచ్చింది. ఇక పెళ్లికాని అబ్బాయిలు చాలా మంది ఉన్నారు ఈ విషయం తనకు ఎలా చెప్పాలో అర్ధం కావడంలేదు అంది ప్రియా. ఆతర్వాత ప్రియా దగ్గరకు వెళ్లి రవి అక్కా నేను ఆ మాటనే అనలేదు అక్క.. నేను సింగిల్ మెన్.. మ్యారీడ్ మెన్ అనే మాట అనలేదు అంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంతలో ప్రియా.. లేదు బ్రో నువ్వు అన్నావ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ.. తనలో తనే కుమిలిపోయింది ప్రియా. మొత్తానికి నిన్న జరిగిన రచ్చ ఈరోజు కూడా కంటిన్యూ అవుతుందని ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. మరి ఈ రోజుతోనైనా ఈ వ్యవహారానికి పులిస్టాప్ పడుతుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: ఆమె సింగిల్.. ఏమైనా చెయ్యొచ్చు అన్న ప్రియా.. రెచ్చిపోయిన రవి.. సీరియస్ అయిన సన్నీ..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో హీట్ పెంచిన ప్రియ- లహరి.. చిన్నపాటి యుద్ధమే జరిగిందిగా..

Bigg Boss 5 Telugu: అబ్బాయిలతోనే బిజీగా ఉంటున్నావ్.. హీట్ పెంచిన ప్రియా కామెంట్స్.. రెచ్చిపోయిన ఆ ఇద్దరు..

Loading...
Unable to load recommendations.
Follow Us