Bigg Boss 10 Telugu: ఏంట్రా ఇది.. తిట్టుకుని కలిసిపోయిన రోహిత్, త్రిగుణ్.. మిత్రులుగా మారి మైండ్ గేమ్స్.. తిరిగొచ్చి బొక్కబోర్లా పడ్డ చరణ్..

బిగ్ బాస్ 10 సీజన్ ఆటే సవాలుగా దూసుకుపోతుంది. అయితే ఇప్పటికే హౌస్ నుంచి ఇద్దరూ ఎలిమినేట్ కాగా.. నిన్నటి ఎపిసోడ్ లో చరణ్ రీఎంట్రీ ఇఛ్చాడు. ఇక గురువారం జరిగిన ఎపిసోడ్ లో ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా అనే పాటతో ఫుల్ జోష్‌లో మొదలైంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

Bigg Boss 10 Telugu: ఏంట్రా ఇది.. తిట్టుకుని కలిసిపోయిన రోహిత్, త్రిగుణ్.. మిత్రులుగా మారి మైండ్ గేమ్స్.. తిరిగొచ్చి బొక్కబోర్లా పడ్డ చరణ్..
Bigg Boss 10 Telugu

Updated on: Sep 18, 2026 | 8:06 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 17 ఎపిసోడ్ లో ఊహించని ట్విస్టులు ఇచ్చాడు బిగ్ బాస్. అలాగే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ రీఎంట్రీ ఇచ్చి ఈసారి ఏకంగా బొక్కబోర్లా పడ్డాడు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఉత్కంఠభరితమైన పరిణామాలు, వ్యూహాలు, ఒక ఊహించని సర్‌ప్రైజ్ రీ-ఎంట్రీతో సాగింది. “ఊ అంటావా మావా” పాటతో హౌస్‌మేట్స్ ఫుల్ జోష్‌లో ఉదయాన్ని ప్రారంభించారు. ఉదయాన్నే రోహిత్, షాలిని, సృష్టి మధ్య టెంపర్ వంశీ ప్రవర్తన ప్రధాన చర్చనీయాంశమైంది. సుధీర్ మొదటినుంచీ జెంటిల్‌మన్ లాగా ఒకేలా ఉంటున్నాడని, కానీ వంశీ కావాలనే స్క్రీన్ స్పేస్ , విజిబిలిటీ కోసం తన ప్రవర్తనను మార్చుకున్నాడని షాలిని, రోహిత్ మాట్లాడుకున్నారు. మరోవైపు, కిచెన్ విషయంలో చిన్నపాటి ఆయిల్ వాడకంపై వంశీ చేసిన మాటలకు వర్షిణి తీవ్రంగా హర్ట్ అయ్యి ఏడ్చేసింది.

ఇంట్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హౌస్‌లో తనకు ప్రత్యర్థిగా ఉన్న రోహిత్ దగ్గరకు వెళ్లి త్రిగుణ్ మాట కలిపాడు. “మనమిద్దరం చాలా స్ట్రాంగ్ ప్లేయర్లం, మన మధ్య ఇతరులు షెల్టర్ తీసుకుంటున్నారు. ఈ వారం మనం ఒకరినొకరు టార్గెట్ చేసుకోకుండా గేమ్ ఆడదాం” అని త్రిగుణ్ చెప్పడంతో. దానికి రోహిత్ కూడా సానుకూలంగా స్పందిస్తూ “నేను వెన్నుపోటు పొడవను” అని తేల్చి చెప్పాడు. మొత్తానికి శత్రువులు ఇద్దరూ కలిసిపోయారు.

తరువాత దశ కెప్టెన్సీ రేసు కోసం రామ్ ప్రసాద్, దేబ్జానీ, త్రిగుణ్ పోటీపడగా, త్రిగుణ్ మొదటి స్థానంలో నిలిచి పైచేయి సాధించాడు. ఈ దశలో బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కు మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చారు. ముగ్గురు రాక్షసుల గెటప్‌లో వచ్చి షాలినిని బలవంతంగా బయటకు తీసుకెళ్తున్నట్లు డ్రామా ఆడటంతో ఇంట్లో వాళ్లంతా కంగారుపడ్డారు. అయితే, ఆ రాక్షసుడి ముసుగు తీసేసరికి తొలి వారంలో బయటకు వెళ్లిన చరణ్ రీ-ఎంట్రీ ఇచ్చాడని తేలడంతో హౌస్‌మేట్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. చరణ్ వైల్డ్ కార్డ్ తరహా రీ-ఎంట్రీతో ఇంట్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రావడంతోనే తనతో టాస్క్ ఆడేందుకు త్రిగుణ్ ను ఎంపిక చేసుకుని మరోసారి బొక్కబోర్లా పడ్డాడు చరణ్. ఈ టాస్కులో త్రిగుణ్ గెలిచాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us