
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 శనివారం నాటి ఎపిసోడ్ వచ్చేసింది. రాజా చేయి వేస్తే అనే పాటతో ఎప్పటిలాగే ఎనర్జిటిక్ స్టెప్పులతో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. ముఖ్యంగా బ్లాక్ డ్రెస్ లో మరింత స్టైలీష్ గా మెరిసిపోయారు. ముందుగా కంటెస్టెంట్స్ ఆట తీరు గురించి నేరుగా ప్రేక్షకులతో మాట్లాడారు నాగ్. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ప్రారంభంలోనే చరణ్ తో రోహిత్ మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు. షాలిని ఎక్కడ ఎలిమినేట్ అయిపోతుందోనని బాధగా ఉందంటూ చెప్పుకొచ్చారు. వెళ్లేవరకు నాతోనే ఉండరా..నాతో గొడవలేం పెట్టుకోకురా అని అంటుంది అంటూ తెగ ఏడ్చేశాడు లవర్ బాయ్ రోహిత్. అప్పుడే షాలిని వచ్చి అడగ్గా ఏం లేదంటూ కవర్ చేశాడు. ఇక తర్వాత ఒక్కొక్కరికి నాగార్జున వాయింపు స్టార్ట్ చేశాడు నాగ్. షాలినిని కన్ఫెషన్ రూంకు పిలిచాడు నాగ్. నామినేషన్స్ టైంలో సెలబ్రెటీలంతా కలిసి ఎవర్ని నామినేట్ చేయాలో డిస్కస్ చేసి నామినేట్ చేశారా అని నాగార్జున అడగడంతో నాకు అలా అనిపించింది సార్ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అసలు వీడియో చూపించి షాలిని బండారం బయటపెట్టాడు నాగార్జున. ఎవరెవరిని నామినేట్ చేయాలి అని అగ్ని పరీక్ష బ్యాచ్ మాట్లాడుకుంటున్న వీడియోను ప్లే చేశాడు. దీంతో షాలిని ఫ్యూజుల్ అవుటయ్యాయి. నామినేషన్స్ గురించి డిస్కషన్ చేయొద్దని ప్రతివారం చెప్పాను. అందరూ ఆపేశారు కానీ మీరు మాత్రం మారడం లేదు. నువ్వు లూప్ లోకి వెళ్లడమే కాకుండా అదే లూప్ లోకి అందర్నీ లాగుతున్నావు. వాళ్లు కలిసి ఆడుతున్నారని వాళ్ల మీద అలిగేషన్స్ చేశావ్ కదా. ఇప్పుడు చేసింది మీరే అంటూ కడిగిపారేశారు నాగ్.
ఇక అపూర్వను అరుపూర్వ అని పిలిచారు నాగ్. ఎందుకు పిలిచానని అడగ్గా.. ఎక్కువగా అరుస్తున్నా అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఎక్కువగా అరుస్తున్నా సర్ అని అపూర్వ చెప్పడంతో మరి ఇంత తెలిసినదానివి అరవడం తగ్గించుకోవచ్చు కదా అని అంటాడు నాగార్జున.ఇక రాంప్రసాద్ ఎఫ్ఐఆర్ అని అంటే ఎఫైర్ అన్నాడని షాలినిని రెచ్చగొడుతున్నావ్ అంటూ వీడియో చూపించి మరీ గాలి తీశారు. దీంతో రాం ప్రసాద్ తనను పెళ్లి చేసుకోవడానికే వచ్చావా.. అబ్బాయిని సెట్ చేయాలా లాంటి మాటలు మాట్లాడారని అన్నారని చెప్పుకొచ్చింది అపూర్వ. నీ మైండ్ లో అలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నీకు ఎఫ్ఐఆర్ అంటే ఎఫైర్ అని వినిపిస్తుంది అని సెటైర్ వేశాడు నాగ్. తర్వాత అపూర్వతో హౌస్ మొత్తానికి సారీ చెప్పించాడు నాగ్.
ఆ తర్వాత ముకేష్ విషయంలో నోరు జారిన అమన్ కు కూడా గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ముకేష్ ను నీ యమ్మా అని తిట్టిన వీడియోను ప్లే చేసి మరీ చూపించారు. దీంతో తనను తాను కవర్ చేసుకుంటూ నీ యమ్మా అనలేదు సార్.. నా స్లాంగ్ లో అలా అనిపిస్తుంది అంటూ తెగ కవర్ చేయడానికి ట్రై చేశాడు. ఇక ముకేష్ కు అమన్ సారీ చెప్పగా.. మా అమ్మకు చెప్పు అన్నాడు ముకేష్. ఇక వర్షిణి కెప్టెన్సీ విషయంలో ముకేష్ నిర్ణయాలు ఎక్కువగా ఉంటున్నాయని కంప్లైంట్ ఇచ్చింది అపూర్వ. తర్వాత రైతు బిడ్డ ఝాన్సీ ఆడిన తొండి గేమ్ వీడియో చూపించి క్లాస్ తీసుకున్నారు. దీంతో అందరికీ క్షమాపణ చెప్పి చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంది ఝాన్సీ. తర్వాత రాంప్రసాద్ తో పవిత్రమైన పెళ్లి గురించి మాట్లాడుకుందామా అని అన్నారు నాగార్జున.
అపూర్వానే తనతో అన్నదని.. ఒక అబ్బాయి కావాలి. బిగ్ బాస్ చెప్పారు ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి. నాకు ఒక మంచి అబ్బాయిని చూడు రామన్నా అని అన్నదని.. ఝాన్సీ తో అలాగే అన్నది తీరా ఆమెతో గొడవ అయ్యేసరికి పవిత్రమైన పెళ్లి కోసం అన్నది అని.. తను బిగ్ బాస్ కు గేమ్ కోసం రాలేదా.. పెళ్లి కోసం వచ్చిందా అని డౌట్ మా అందరికి వచ్చిందంటూ అపూర్వ కన్నింగ్ ప్లాన్ బయటపెట్టాడు రాంప్రసాద్. దీంతో అపూర్వ మాట్లాడుతూ తనను తాను కవర్ చేసుకోవడానికి రాం ప్రసాద్ మాట్లాడిన ప్రతి మాటను తప్పుగానే చూపించాలని ట్రై చేసింది. దీంతో షాలిని లేచి అపూర్వ బండారం బయటపెట్టేసింది. సార్ వాళ్లు సరదాగానే అన్నారు. కానీ ఇప్పుడు ఈమె చెప్పే మాటలు నిజం కాదని తేల్చేసింది షాలిని. హౌస్ లోకి రాగానే రోహిత్ తో మాట్లాడుతూ నీది నాది హిట్ పెయిర్ కదా.. మనిద్దరికీ బావుంటుంది కదా అని అన్నది. అలాగే షాలిని, రోహిత్ పెయిర్ బాలేదని చెప్పింది. ఇప్పుడేమో లవ్ కంటెంట్ కోసం రాలేదని చెప్పడం మ్యాచ్ కావడం లేదంటూ అపూర్వ బండారం బయటపెట్టేసింది షాలిని. ఇక చివరకు లవర్ బాయ్ రోహిత్ ఆట తీరుపై నాగార్జున వరుసగా కౌంటర్స్ ఇచ్చాడు.