Ariyana Glory : బిగ్ బాస్ షో తర్వాత అరియనా పేరు మారుమ్రోగుతోంది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన గడుసు తనంతో… తన చిలిపి తనంతో.. తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. సెలబ్రిటీగా ఫేమస్ అయిపోయింది. మోడల్ గా … యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆర్జీవీ నోట్ లో పడి తెగ పాపులర్ అయిపోయింది.
ఎక్కడ చూసిన ఈ అమ్మడి గురించే మాట్లాడుకుంటున్నారు యువత. తన అందంతో కుర్రకారుని వలలో వేసుకుంది ఈ చిన్నది. ఇటీవలే ఆర్జీవీ జిమ్ లో బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే..సినిమా హీరోయిన్ల సంగతోమో కాని… ఆరియానా మేకప్‌కు మాత్రం చాలా మంది సిబ్బంది కావాల్సిందే.. ఇది నేనుంటున్న మాట కాదండి.. ఆరియాననే చూపించిన ఫ్యాక్ట్ ఇది. ఈ వీడియోను చూస్తే మీరు అదే అంటారు. రీసెంట్ గా ఓ షోలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేందుకు వెళ్లిన ఆరియానా… ఆ పర్ఫార్మెన్స్కు ముందు ఇలా మేకప్ రూమ్‌లో కనిపించారు. చుట్టూ హెయిర్ డ్రెసర్, మేకప్, క్యాస్టూమ్ డిజైనర్…. ఇలా.. అంత మంది మధ్యలో కూల్ గా … కామ్‌గా…పేషన్స్ తో నిల్చుని… ముస్తాబై ఆ తరవాత స్టేజ్‌పై తన డ్యాన్స్‌తో అందర్నీ ఫిదా చేసింది.