బుల్లితెరలో ప్రసారమైన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా ప్రేక్షకులు దగ్గరైంది అవికా గోర్. ఆ తర్వాత ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోయిన్‌గాను మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంది అవికా.. సినిమా చూపిస్తా మామ, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజుగారి గది 3, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాల తర్వాత అవికాకు అంతగా ఆఫర్లు రాలేదు. అయితే అవికా గోర్.. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తర్వాత హిందీలో ససురాల్ సిమర్ కా అనే మరో సీరియల్ లోనూ నటించింది. అందులో ఆమె నటుడు మనీశ్ రాఘ్సింఘన్ భార్య పాత్రలో నటించింది. అయితే ఆ సీరియల్ లో నటిస్తున్న సమయంలో వీరిద్ధరూ ప్రేమలో ఉన్నారని.. అంతేకాకుండా… రహాస్యంగా ఓ బిడ్డను కూడా కన్నారని బాలీవుడ్ టాక్ నడిచింది.
తాజాగా అవికా గోర్ ఈ విషయంపై స్పందించింది… అవికా మాట్లాడుతూ.. మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. మేం ఓ బిడ్డను కన్నామని.. ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచామని అంటున్నారు. కానీ అది పూర్తిగా అవాస్తవం. 13 ఏళ్ల వయసులో నటిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి మనీశ్ నాకు స్నేహితుడు. అతడికి నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. అతడి నుంచి చాలా నేర్చుకున్నాను. మేమిద్దం రిలేషన్ లో ఉన్నామని ఇప్పటికీ చాలా మంది అడుగుతున్నారు. కానీ ఏం చెప్పను ? మనీశ్.. మా నాన్న కంటే కొంచెం చిన్నవాడు.. అంటే సరిగ్గా మా నాన్న వయసు. ఇక మేము ప్రేమలో ఉన్నామని వచ్చిన వార్తలు మా మీద తీవ్ర ప్రభావం చూపించాయి. కొన్ని వారాల పాటు మేమిద్దరం మాట్లాడుకోలేదు. అయినా.. పుకార్లు మాత్రం వస్తూనే ఉన్నారు. దీంతో మేమిద్దరం దూరంగా ఉండడంలో అర్థం లేదు అనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ లా కలిసిపోయాం. మా గురించి రాసిన వార్తలు ఇప్పటికీ చదివి నవ్వుకుంటున్నాం అంటూ చెప్పుకోచ్చింది అవికా గోర్.
Also Read: Vasalamarri : సంబరపడిపోతోన్న వాసాలమర్రి.. అధినేత ఎంట్రీతో ఇక తమ గ్రామ రూపురేఖలు మారనున్నాయని ఆనందం