Alluri Movie: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు ‘అల్లూరి’.. ఎక్కడ చూడచ్చంటే.!

|

Oct 07, 2022 | 4:55 PM

ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయిన 'అల్లూరి' మూవీ. ఆహాలో అక్టోబర్ 7వ తేదీ రాత్రి 8 గంటల నుంచి..

Alluri Movie: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అల్లూరి.. ఎక్కడ చూడచ్చంటే.!
Alluri Movie
Follow us on

రొటీన్‌కు భిన్నంగా సినిమాలు తీస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరో శ్రీవిష్ణు. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘అల్లూరి’. దీనికి దర్శకుడు ప్రదీప్ వర్మ కాగా.. ఓ పోలీస్ ఆఫీసర్ చుట్టూ సినిమా కథాంశాం తిరుగుతుంది. సెప్టెంబర్ 23వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ.. కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయింది.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 7వ తేదీ శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు మేకర్స్ ప్రకటించారు. థియేటర్లలో విడుదలైన రెండు వారాలలోపే ఈ సినిమాలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఈరోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో సింహ కోడూరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..