వలస కార్మికురాలి కుమారుడికి సోనూ పేరు.. చలించిపోయానన్న రీల్ హీరో..!

| Edited By:

May 29, 2020 | 1:07 PM

కరోనా లాక్‌డౌన్ వేళ పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులకు దేవుడిగా మారారు నటుడు సోనూసూద్. సినిమాల్లో విలన్ పాత్రల్లో ఎక్కువగా నటించిన ఈ నటుడు రియల్

వలస కార్మికురాలి కుమారుడికి సోనూ పేరు.. చలించిపోయానన్న రీల్ హీరో..!
Follow us on

కరోనా లాక్‌డౌన్ వేళ పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులకు దేవుడిగా మారారు నటుడు సోనూసూద్. సినిమాల్లో విలన్ పాత్రల్లో ఎక్కువగా నటించిన ఈ నటుడు రియల్ లైఫ్‌లో మాత్రం హీరోగా అందరి చేత మన్ననలు పొందుతున్నారు. వలస కార్మికులకు ఆయన చేస్తున్న సాయానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా తాను సహాయం చేసిన ఓ వలస కార్మికురాలు తన కుమారుడికి సోనూ సూద్ పేరును పెట్టుకుందట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

”నాకు పుట్టిన కుమారుడికి మీ పేరు పెట్టాను సర్ అంటూ ఓ మహిళ నాకు ఫోన్ చేసి చెప్పింది. వారి ఇంటి పేరును చివరకు చేర్చి సోనూ సూద్ శ్రీవాస్తవ అని పెట్టినట్లు ఆమె తెలిపింది. అది నన్ను చాలా కదిలించింది” అని సోనూ సూద్ అన్నారు. ”వలస కార్మికులు వారి చిన్న చిన్న పిల్లలను తీసుకొని నడక మార్గంలో వెళ్లడం నన్ను చాలా బాధించింది. మనం నివాసం ఉంటున్న ఇళ్లు, ఆఫీసులు వారు కట్టినవే. కానీ ఇప్పుడు వారు రోడ్డు మీద ఉన్నారు. వారికి చేతనైన సాయం చేయాలనుకున్నా. అందుకే ప్రభుత్వాలతో మాట్లాడి వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపుతున్నా” అని సోనూ చెప్పుకొచ్చారు.

”ఏదైనా ఆపద వచ్చినప్పుడు సోషల్ మీడియాలో బాధను వ్యక్తపరచడం కంటే మనకు తోచినంత సాయం చేయాలి. అలాగని అందరూ ఇలానే చేయాలని చెప్పను. కానీ నలుగురికి సేవ చేసే అవకాశం నాకు దేవుడు ఇచ్చాడు. ఈ సమయంలో ఎవరికైనా కావాల్సింది నమ్మకం” అని ఈ రియల్ హీరో వివరించారు.

Read This Story Also: వరుస పరిణామాలు.. హాట్‌ టాపిక్‌గా ‘సూర్య’ సినిమాలు..ఫ్యాన్స్ రిక్వెస్ట్‌ ఏంటంటే..!