Sonu Sood News : వీరులు త‌యార‌వుతారు..పుట్ట‌ర‌ని మీ పుస్త‌కంతో మ‌రోసారి నిరూపించారు…

కరోనా కష్టకాలంలో వలస కార్మికుల పాలిట దైవంగా మారదు సోనూసూద్. వేలమందికి సాయం అందించిన సోనూసూద్.. కష్టాల్లో ఉన్నవారికి అండగానూ నిలిచాడు..

Sonu Sood News : వీరులు త‌యార‌వుతారు..పుట్ట‌ర‌ని మీ పుస్త‌కంతో మ‌రోసారి నిరూపించారు...

Updated on: Dec 30, 2020 | 5:40 PM

Sonu Sood has proved it again : కరోనా కష్టకాలంలో వలస కార్మికుల పాలిట దైవంగా మారదు సోనూసూద్. వేలమందికి సాయం అందించిన సోనూసూద్.. కష్టాల్లో ఉన్నవారికి అండగానూ నిలిచాడు. లాక్ డౌన్ లో వలస కార్మికులకు సాయం అందించిన అనుభవాలతో ఓ పుస్తకం రుపొంచించాడు ఈ రీయల్ హీరో. పెంగ్విన్ ర్యాండ్ హౌజ్ ఇండియా ఆటోబ‌యోగ్ర‌ఫీ (సోనూసూద్‌ ఆత్మ‌క‌థ)‌ ఐ యామ్ నో మెస్సీయ‌ పుస్త‌కం రాసాడు సోనూ. ఈ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవికి అందజేశాడు. ప్రస్తుతం ‘ఆచార్య’ షూటింగ్ లో పాల్గొంటున్న సోనూసూద్ సెట్లో తన పుస్తకాన్ని చిరంజీవికి గిఫ్ట్ చేశారు.

సోనూసూద్ ఆత్మకథ పుస్తకంపై చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘వీరులు త‌యార‌వుతారు.. పుట్ట‌ర‌ని మీ పుస్త‌కంతో మ‌రోసారి నిరూపించారు. వేలాదిమందికి సాయం చేస్తూ సాగిన మీ  ప్ర‌యాణం కోట్లాదిమందికి స్పూర్తిని క‌లిగించే విషయం’ అని ట్విట‌ర్ లో పోస్ట్ చేశారు మెగాస్టార్. ఇక సెట్ లో పుస్తకాన్ని చిరంజీవికి అందజేస్తున్న సమయంలో తీసిన ఫోటోని కూడా షేర్ చేశారు చిరు. ఈ ఫొటోలో మెగాస్టార్, సోనూసూద్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. మెగాస్టార్ స్టైలిష్ గా కనిపిస్తుండగా.. సోనూ కోరమీసాలతో మెడలో రుద్రాక్షతో కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also read:

Photo leak : నాగచైతన్య ‘థాంక్యూ’ మూవీనుంచి ఫోటో లీక్… హాకీ ప్లేయర్ గా కనిపించనున్న అక్కినేని యంగ్ హీరో

Loading...
Unable to load recommendations.
Follow Us