Sirivennela Sitarama Sastry: ఆ పాటను రాయమని ఆర్జీవి చెప్పింది విని ఆశ్చర్యపోయా.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి..

సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినీ సాహిత్య ప్రపంచంలో ఎన్నో అద్భుత పాటలను సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమ, కోపం, బాధ ఎన్నో భావాలను ఒక్క పాటలో మిలితం చేసి శ్రోతల హృదయాలను హత్తుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరలవుతున్నాయి. కొన్ని పాటలు ఆర్జీవీ స్పష్టమైన విజన్‌తో పాటలు ఎలా పుట్టాయో వివరించారు.

Sirivennela Sitarama Sastry: ఆ పాటను రాయమని ఆర్జీవి చెప్పింది విని ఆశ్చర్యపోయా.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి..
Sirivennela

Updated on: May 31, 2026 | 11:56 AM

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV)తో తన సహ రచనా అనుభవాలను, ముఖ్యంగా క్షణక్షణం చిత్రంలోని పాటల గురించి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. పాటలు సినిమా కథలో ఎలా లీనమవుతాయి, ఎలా విడిగా నిలబడతాయి అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, దర్శకుడికి సన్నివేశం పట్ల ఎంత సహజత్వం, స్పష్టత ఉంటే పాట అంత శక్తివంతంగా ఉంటుందని శాస్త్రి అన్నారు. క్షణక్షణం చిత్రాన్ని ఉదాహరణగా పేర్కొంటూ, ఆర్జీవికి సినిమాలోని పాటల పట్ల అసాధారణమైన స్పష్టత ఉండేదని సిరివెన్నెల వివరించారు. ఆ సినిమాకు మొత్తం మీద రెండే రెండు పాటలకు చోటు ఉందని ఆర్జీవీ చెప్పారని, వాటిలో జామురాత్రిరి జాబిలమ్మ ఒకటని తెలిపారు. ఈ పాట వెనుక ఉన్న ప్రత్యేకమైన ఆలోచనను శాస్త్రి ప్రస్తావించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

శ్రీదేవి వంటి సుందరిపై బురద చల్లి, ఆమెను గోతిలోకి తోసి, ఆమెను ఒక పసిపాపలా చూస్తూ జోలపాడాలనే ఆర్జీవి ఆలోచన విచిత్రంగా అనిపించినా, అది ఒక సార్వత్రిక భావోద్వేగాన్ని పలకరించిందని ఆయన అన్నారు. కీరవాణి ట్యూన్ చేసిన తర్వాత, పాటను ఎలా చిత్రీకరించాలో ఆర్జీవికి పూర్తి స్పష్టత ఉండేదని, అది తన రచనపై ఎటువంటి ప్రభావం చూపలేదని, కవికి స్వేచ్ఛనిచ్చిందని సిరివెన్నెల గుర్తు చేసుకున్నారు. అలాగే, అందినంత ఎత్తా తారా తీరం పాట గురించి మాట్లాడుతూ, మొదట ఎందుకంద దందా అని రాసినప్పుడు ఆర్జీవి దాన్ని తమాషాగా మార్చమని అడిగారని, అయినప్పటికీ శాస్త్రికిఆ పదం నచ్చిందని తెలిపారు. ఈ పాట కూడా సినిమా కథకు నేరుగా సంబంధం లేకపోయినా, భయాన్ని తరిమేసి ఆశను రేకెత్తించే ఒక చల్లదనాన్ని సృష్టించే అవసరాన్ని తీర్చిందని ఆయన అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

ఒక పాట కేవలం సినిమా సన్నివేశానికి మాత్రమే కాకుండా, ఒక తండ్రి తన పాపకు పాడుకునే జోలపాటలా, లేదా ప్రియుడు తన ప్రియురాలికి పాడుకునే పాటలా సార్వత్రికంగా నిలబడాలని సిరివెన్నెల కోరుకున్నారు. ఒక పాట విడుదలైనప్పుడు, అది కేవలం నటీనటులు, దర్శకుడి ప్రతిభకు మాత్రమే పరిమితం కాకుండా, ఆ పాటలోని లోతైన భావం ప్రేక్షకులకు చేరాలని ఆయన చెప్పారు. ఏదైనా కానుకను అందించినప్పుడు, దాని చుట్టూ ఉన్న రంగుల ర్యాపర్లు, పెట్టెలు ఆనందాన్ని పంచుతాయి. కానీ నిజమైన సంతోషం దాని లోపల దాగి ఉన్న వస్తువులో ఉంటుందని ఆయన ఒక అందమైన ఉపమానంతో వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

Loading...
Unable to load recommendations.
Follow Us