Eesha Rebba: ఇంత హాట్‌గా ఎలా తయారయ్యావ్‌?.. ఈషా నేచురల్ ఫొటోపై యంగ్‌ హీరోయిన్‌ నాటీ కామెంట్‌..

టాలీవుడ్‌ తెలుగింటి అందం ఈషా రెబ్బా (Eesha Rebba) అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం, అభినయపరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.

Eesha Rebba: ఇంత హాట్‌గా ఎలా తయారయ్యావ్‌?.. ఈషా నేచురల్ ఫొటోపై యంగ్‌ హీరోయిన్‌ నాటీ కామెంట్‌..

Updated on: Feb 06, 2022 | 8:16 AM

టాలీవుడ్‌ తెలుగింటి అందం ఈషా రెబ్బా (Eesha Rebba) అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం, అభినయపరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆతర్వాత బందిపోటు, అమీతుమీ, దర్శకుడు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. నాని నిర్మించిన ‘అ’ మూవీలో ఈషా బోల్డ్‌ క్యారెక్టర్‌కు మంచి ప్రశంసలే దక్కాయి. అరవింద సమేత వీరరాఘవ లో పూజాహెగ్గే(PoohaHegde) కు చెల్లిగా మెప్పించింది. ఆ తర్వాత బ్రాండ్‌ బాబు, సుబ్రహ్మణ్యపురం సినిమాల్లో హీరోయిన్‌గా ఆకట్టుకుంది. ప్రస్తుతం పిట్టకథలు, 3 రోజెస్‌ లాంటి వెబ్‌ సిరీస్‌లలో కూడా నటిస్తూ మెప్పిస్తోందీ అందాలతార. కాగా సినిమాలతో పాటు సోషల్‌ మీడయాలోనూ చురుగ్గా ఉంటుంది ఈషా. నిత్యం తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలను అందులో షేర్‌ చేస్తుంటుంది.

అందం తింటున్నావా? అన్నం తింటున్నావా?

అలా తాజాగా సన్‌లైట్‌లో కూర్చొని ఎంతో నేచురల్‌గా దిగిన ఈషా ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ గా మారాయి. ఎప్పటిలాగే అభిమానులు, నెటిజన్లు లవ్‌, హార్ట్‌ ఎమోజీలతో కామెంట్ సెక్షన్‌ని నింపేశారు. కాగా ఈషా స్నేహితురాలు, యంగ్‌ హీరోయిన్‌ శివానీ రాజశేఖర్‌ (Shivani Rajasekhar) అయితే ‘ ఇంత హాట్‌గా ఎలా తయారయ్యావ్‌? అందం తింటున్నావా? అన్నం తింటున్నావా’ అంటూ నాటీగా కామెంట్‌ చేసింది. ఇక శివానీ కామెంట్‌కు సిగ్గు పడ్డ ఈషా రెబ్బా.. ‘గో రే’ అని సరదాగా రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి సరదా సంభాషణ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈషా, శివానీ మంచి స్నేహితులు. రాజశేఖర్‌ మరో కూతురు శివాత్మిక కూడా అప్పుడప్పుడు ఈ గ్రూప్‌లో కనిపస్తుంటుంది. కాగా శివానీ ఇప్పుడు ఓటీటీ స్టార్‌గా ఎదుగుతోంది. ఆమె ఇటీవల నటించిన అద్భుతం, WWW సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

Also Read:Nayanthara: నయన్‌ను మిస్‌ అవుతున్నానంటోన్న విఘ్నేశ్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ వైరల్‌..

Lata Mangeshkar: లతాజీ కోసం ఆస్పత్రికి వెళ్లిన ఆశా భోస్లే.. దీదీ ఆరోగ్య పరిస్థతిపై ఏం చెప్పారంటే..

Ashu Reddy: నెట్టింట్లో అషు రెడ్డి రచ్చ.. ఏకంగా ఫోన్ నంబర్ షేర్ చేసి జలక్ ఇచ్చిన బిగ్‏బాస్ బ్యూటీ.. దండం పెట్టిన నెటిజన్..

Loading...
Unable to load recommendations.
Follow Us