ఆ రీమేక్‌లో నేను నటించట్లేదు – సాయి తేజ్

|

Apr 12, 2019 | 6:15 PM

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘చిత్రలహరి’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక వరస పరాజయాలతో సతమతమవుతున్న సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రం పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘గల్లీ బాయ్’ తెలుగు రీమేక్ లో తేజు నటించనున్నాడని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై తేజు క్లారిటీ ఇచ్చాడు. ఆయన […]

ఆ రీమేక్‌లో నేను నటించట్లేదు - సాయి తేజ్
Follow us on

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘చిత్రలహరి’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక వరస పరాజయాలతో సతమతమవుతున్న సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రం పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘గల్లీ బాయ్’ తెలుగు రీమేక్ లో తేజు నటించనున్నాడని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై తేజు క్లారిటీ ఇచ్చాడు. ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నేను ఆ సినిమా ఇప్పటివరకు చూడలేదని..ఇక దాన్ని రీమేక్ చేసే ఆలోచన కూడా లేదని’ స్పష్టం చేశాడు.