
‘కాంతారా’.. కన్నడంలో చిన్న సినిమాగా విడుదలై.. పాన్ ఇండియా వైడ్‌గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. ఒక్క భాషలోనే కాదు.. విడుదలైన అన్ని లాంగ్వేజ్‌స్‌లోనూ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడమే కాదు.. వసూళ్లు పరంగా ప్రభంజనం సృష్టించింది. థియేటర్లలో ఇంకా తన లాంగ్ రన్‌ను కొనసాగిస్తున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా.? అని ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఓ కీలక అప్‌డేట్ వచ్చేసింది. ‘కాంతారా’ ఓటీటీ తేదీపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. ‘Amazon Help’ ట్వీట్ రూపంలో సమాధానం ఇచ్చింది.
‘కాంతారా’ రిలీజ్ డేట్ చెప్పండి. ప్లీజ్.! అంటూ ఓ నెటిజన్ అమెజాన్ కస్టమర్ సర్వీస్‌కు ట్వీట్ చేయగా.. ”కాంతారా’ మూవీ స్ట్రీమింగ్ తేదీకి సంబంధించి మీ ఆత్రుత అర్ధం చేసుకున్నాం. ఈ టైటిల్‌తో ఉన్న సినిమా నవంబర్ 24, 2022 నుండి స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది’. అని ‘Amazon Help’ రీ-ట్వీట్ ఇచ్చింది. అయితే కాసేపటికే ఆ ట్వీట్ అమెజాన్ డిలీట్ చేయడంతో.. స్ట్రీమింగ్ డేట్ మారుస్తారా.? అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం డిలీట్ చేశారా.? అనే దానిపై సందిగ్దత నెలకొంది. కాగా, రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ మూవీని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగండుర్ నిర్మించారు. ఈ చిత్రం కన్నడంలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదల కాగా.. తెలుగులో అక్టోబర్ 15న రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 360 కోట్లు పైగానే వసూళ్లు సాధించింది.’