చనిపోయే ముందు రోజు సుశాంత్‌‌ ఓ కథకు ఓకే చెప్పారట

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ మృతి మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. ఈ నటుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు..? నిజంగానే బలవన్మరణానికి పాల్పడ్డారా..?

చనిపోయే ముందు రోజు సుశాంత్‌‌ ఓ కథకు ఓకే చెప్పారట

Updated on: Aug 07, 2020 | 8:05 PM

Sushant Singh Case Updates: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ మృతి మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. ఈ నటుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు..? నిజంగానే బలవన్మరణానికి పాల్పడ్డారా..? లేక హత్య చేశారా..? వంటి ప్రశ్నలు అందరిలో మెదులుతున్నాయి. ఇదిలా ఉంటే అవకాశాలు లేకపోవడంతో డిప్రెషన్‌కు గురైన సుశాంత్‌ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని మొదటి నుంచి పలువురు కామెంట్లు చేశారు. అయితే వాటిని సుశాంత్ సన్నిహితులు కొట్టివేశారు. వచ్చే ఏడాది చివరి వరకు సుశాంత్‌ డైరీ ఫుల్‌గా ఉందని తెలిపారు. ఇక తాజాగా నిర్మాత రమేష్‌ తౌరానీ, సుశాంత్‌ గురించి మాట్లాడారు.

చనిపోయే ముందు రోజు సుశాంత్‌కి ఓ స్టోరీ స్క్రిప్ట్‌ని వినిపించినట్లు ఆయన తెలిపారు. దర్శకుడు నిఖిల్ అద్వానీ, తాను జూన్‌ 13న సాయత్రం సుశాంత్‌తో ఓ స్టోరీ డిస్కషన్‌ చేశామని వెల్లడించారు. రిపోర్టులో కూడా వీరు దాదాపు 12 నిమిషాలు మాట్లాడినట్లు తేలింది. ఇక ఆ తరువాత తాను సుశాంత్‌ టాలెంట్ మేనేజర్‌తో 5 నుంచి 6 నిమిషాలు మాట్లాడినట్లు రమేష్ పేర్కొన్నారు. అంతేకాదు నెరేషన్ చాలా బావుందని, మొత్తం స్క్రిప్ట్‌ని తయారుచేసుకొని రావాలని సుశాంత్‌ చెప్పినట్లు కూడా రమేష్ వివరించారు.‌ కాగా ఈ కేసులో ఈడీ అధికారుల ముందుకు ఇవాళ రియా హాజరైన విషయం తెలిసిందే.

Read This Story Also: మళ్లీ అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి

Loading...
Unable to load recommendations.
Follow Us