
భారతీయ చారిత్రక, పౌరాణిక ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణం’. బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందించిన ఈ విజువల్ వండర్ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై తాజాగా అంతర్జాతీయ మీడియా, సినీ విమర్శకుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్, అట్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నమిత్ మల్హోత్రా, యష్, చార్లెస్ రోవన్ భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారు. ఇక ఇందులో కాజల్, రకుల్, శోభన వంటి స్టార్స్ సైతం ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను నవంబర్ 5న అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. దీంతో ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన అడియన్స్ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..