RRR Movie update : చివరిదశలో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్.. భారీ ప్లాన్‌‌‌‌‌తో సిద్ధమవుతున్న దర్శకధీరుడు..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలు తగ్గట్టుగానే తన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడు జక్కన..

RRR Movie update : చివరిదశలో ఆర్ఆర్ఆర్ షూటింగ్.. భారీ ప్లాన్‌‌‌‌‌తో సిద్ధమవుతున్న దర్శకధీరుడు..

Updated on: Feb 01, 2021 | 5:12 PM

RRR Movie : టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలు తగ్గట్టుగానే తన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడు జక్కన. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ అనే ప్రతిష్టాత్మక సినిమాను తెరకెక్కించేపనిలో ఉన్నాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

కాగా ఇప్పటికే విడుదలైన టీజర్లు సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ ను అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ సినిమా విడుదలకు చాలా సమయం ఉన్నప్పటికీ  ప్రమోషన్స్ మాత్రం వీలైనంత త్వరగా ప్రారంభించాలని చూస్తున్నాడు దర్శకధీరుడు. ఈ సినిమా తెలుగుతోపాటు దేశంలో పలు భాషల్లో విడుదలకబోతుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను వినూతనంగా ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. ముఖ్యంగా బాలీవుడ్ లో క్రేజ్ దక్కించుకోవడం కోసం ప్రమోషన్స్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే  ఈ సినిమాపై మంచి బజ్ ఉంది, మరి జక్కన ఎలాంటి ప్రమోషన్ ప్లాన్ తో వస్తాడో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

జంధ్యాల పరిచయం చేసిన ఆ నవ్వుకు 65 వసంతాలు.. టాలీవుడ్‌‌‌‌లో ఆకాశాన్ని తాకిన హాస్య శిఖరం బ్రహ్మానందం..

 

Loading...
Unable to load recommendations.
Follow Us