డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఇదే నా గిఫ్ట్ – ప్రభాస్
‘డార్లింగ్’ ప్రభాస్ నిన్న చెప్పినట్లు గానే ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌తో ముందుకొచ్చాడు. ‘సాహో’ మూవీ లేటెస్ట్ లుక్, రిలీజ్ డేట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు పరిచయం చేశాడు. కళ్ళజోడు పెట్టుకుని తీక్షణంగా చూస్తున్న ప్రభాస్ లుక్ హాలీవుడ్ రేంజ్‌లో ఉందనే చెప్పాలి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ‘షేడ్స్ అఫ్ సాహో’ టీజర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ […]

‘డార్లింగ్’ ప్రభాస్ నిన్న చెప్పినట్లు గానే ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌తో ముందుకొచ్చాడు. ‘సాహో’ మూవీ లేటెస్ట్ లుక్, రిలీజ్ డేట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు పరిచయం చేశాడు. కళ్ళజోడు పెట్టుకుని తీక్షణంగా చూస్తున్న ప్రభాస్ లుక్ హాలీవుడ్ రేంజ్‌లో ఉందనే చెప్పాలి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ‘షేడ్స్ అఫ్ సాహో’ టీజర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకుడు.
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అరుణ్ విజయ్, జాకీ షరీఫ్, మందిరా బేడీ, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.