రెండు వారాల్లోనే ఓటీటీలోకి.. సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

ఓటీటీలో రకరకాల సినిమాలు విడుదలై అలరిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. అలాగే రకరకాల జోనర్స్ లో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఇక కొత్త సినిమాలు కూడా ఓటీటీలో విడుదలై అలరిస్తున్నాయి. థియేటర్స్‌లో విడుదలైన నెలరోజులకు సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.

రెండు వారాల్లోనే ఓటీటీలోకి.. సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!
Ugly Story

Updated on: Jun 04, 2026 | 7:58 PM

థియేటర్స్ లో పెద్ది సినిమా ప్రస్తుతం సందడి చేస్తుంది. జూన్ 4న (నేడు) పెద్ది సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. థియేటర్స్ లో ఫ్యాన్ పండగ చేసుకుంటున్నారు. పెద్ది సినిమాతో రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఓటీటీలోనూ సినిమాలు సందడి చేస్తున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో అలరిస్తుంటే ఓటీటీలోకి కొన్ని క్రేజీ సినిమాలు రానున్నాయి. ఇక ఇప్పుడు ఓ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతుంది. విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది.

ఇటీవలే ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. ఇక ఇప్పుడు విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతుంది. ఆ సినిమా ఎదో కాదు.. అవికా గోర్, శ్రీ నందు లీడ్ రోల్స్‌లో నటించిన ‘అగ్లీ స్టోరీ’. ఈ సినిమా రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చింది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కింది అగ్లీ స్టోరీ సినిమా. ప్రణవ్ స్వరూప్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అగ్లీ స్టోరీ’ సినిమా మే 22న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. విడుదలకు ముందు మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

కమర్షియల్‌గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఆడియన్స్‌ను పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోవడంతో ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుంది. జూన్ 5న అంటే మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రానుంది అగ్లీ స్టోరీ. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అగ్లీ స్టోరీ సినిమా విడుదలకానుంది. థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయిన అగ్లీ స్టోరీ ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us