Trisha Krishnan: ఓటీటీ వేదికగా విడుదల కానున్న స్టార్ హీరోయిన్ సినిమా.. నిరాశలో అభిమానులు

తెలుగులో ఒకప్పుడు రాణించిన హీరోయిన్స్ లో ఒకరు త్రిష. ఈ చెన్నై చిన్నది తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోయింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమా లు చేసి టాప్ హీరోయిన్ గా మారిపోయింది.

Trisha Krishnan: ఓటీటీ వేదికగా విడుదల కానున్న స్టార్ హీరోయిన్ సినిమా.. నిరాశలో అభిమానులు
Trisha

Updated on: Apr 13, 2021 | 5:35 PM

Trisha Krishnan:  తెలుగులో ఒకప్పుడు రాణించిన హీరోయిన్స్ లో ఒకరు త్రిష. ఈ చెన్నై చిన్నది తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోయింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమా లు చేసి టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఆతర్వాత తెలుగులో సినిమాలు తగ్గించింది. కానీ తమిళ్ లో సినిమాలు చేస్తూనే ఉంది.  రీసెంట్ గా తమిళ్ లో విజయ్ సేతుపతి సరసన నటించిన 96 సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి పోటాపోటీగా నటించిన త్రిష అందరిని ఆకట్టుకుంది. అయితే ఇటీవల తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు.

ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, అలాగే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది ఈ చెన్నై బ్యూటీ.ఈ నేపథ్యంలో తమిళ్ లో త్రిష ఓ సినిమా చేస్తుంది. పరమపతం విలయట్టు అనే సినిమా చేస్తుంది. ఈ మూవీ త్రిష కెరియర్ లో 60వ సినిమా. 24 ఫ్రెమ్స్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తిరుగ్ననం దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి నెలలోనే విడుదల కావాల్సింది. కానీ ఏవో కారణాల వలన సినిమా వాయిదా పడుతూ వస్తుంది.  ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. గతఏడాది విడుదలకావల్సిన ఈ సినిమా అనేక కారణాల చేత వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ సినిమా ఎంత ఆలస్యమైన థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తారని అభిమానులంతా అనుకున్నారు కానీ ఈ సినిమాను ఓటీటీ వేదికగా  రిలీజ్ చేస్తున్నారు. డిస్నీ + హాట్‌స్టార్‌లోఈ సినిమా ఏప్రిల్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా తో పాటు త్రిష మణిరత్నం తెరకెక్కిస్తున్న  పీరియడ్ చిత్రం పొన్నియిన్ సెల్వన్ షూటింగ్లో బిజీగా ఉంది . ఈ చిత్రంలో త్రిష చోళ యువరాణి కుందవై పాత్రలో నటించనుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ravi Teja : ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న రవితేజ.. మరో సినిమాను పట్టాలెక్కించి మాస్ రాజా

Rashmika Mandanna : ఈ లక్కీ బ్యూటీ టాలీవుడ్‌‌‌‌‌ను నై అని బాలీవుడ్‌‌‌‌కు సై అంటుందా..?

Khiladi​​ Movie Teaser: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న మాస్ రాజా.. ఖిలాడి టీజర్‌‌‌‌తో కుమ్మేస్తున్న రవితేజ

 

Follow Us