
ఈ వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా దసరాకు థియేటర్లలో రిలీజైన సినిమాలన్నీ ఈ వీకెండ్ లో ఓటీటీలో సందడి చేయనున్నాయి. జైలర్ 2, రణబాలి, దాయిరా, క్రేజీ కల్యాణం, హ్యాపీ జర్నీ, పుష్పక విమానం, పరివారిక్ మనురంజన్ లాంటి మూవీస్, సిరీసులు ఈ వారాంతంలో ఆడియెన్స్ ను అలరించనున్నాయి. ఇప్పుడీ జాబితాలోకి మరో కొత్త సినిమా చేరింది. ఇదొక తెలుగు మెడికల్ సర్వైవల్ థ్రిల్లర్. ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషికి కుడివైపు గుండె ఉంటే అనే వినూత్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాగానే ఆడింది. ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. అయితే స్టార్ క్యాస్టింగ్ లేకపోవడంతో ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడలేకపోయింది. ఇప్పుడీ తెలుగు సినిమా ఓటీటీలోకి రానుంది. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
కికు యనమల, కశిశ్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ మెడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘కికు చిరంజీవి’. శుభసాయి వెంకట్ దర్శకత్వం వహింంచారు. కికు యనమల, కశిశ్ ఖాన్‌లతో పాటు తనికెళ్ల భరణి, ఈశ్వరీ రావు, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కికు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దీప్తి నడిమింటి నిర్మించిన ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ శనివారం (నవంబర్ 14) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్నిఆహా ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
‘కికు చిరంజీవి’ సినిమా కథ విషయానికొస్తే.. అరకులో ఫోటోగ్రాఫర్‌గా పనిచేసే చిరంజీవి (కికు యనమల)కి ఒక అరుదైన సమస్య ఉంటుంది. అతడి గుండె ఎడమ వైపు కాకుండా కుడి వైపు ఉంటుంది. దీన్ని డెక్స్ట్రోకార్డియా అంటారు. దీని వల్ల కాస్త కష్టపడినా శ్వాస ఇబ్బందులు వస్తుంటాయి. ఇదే క్రమంలో అరకు టూర్‌కు వచ్చిన మను (కాశీష్ ఖాన్) అనే అమ్మాయితో అతనికి పరిచయం ఏర్పడుతుంది. అయితే మనుని ముఖానికి మాస్క్ ధరించిన వ్యక్తి టార్గెట్ చేస్తాడు. దీంతో వీళ్లిద్దరూ ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకుంటారు. తర్వాత ఏం జరిగింది? అనేది మిగతా స్టోరీ.