Indian Idol Season 4: త్వరలోనే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4.. ఈ నెల 20న గ్రాండ్ లాంచ్

సరైన వేదికలు కల్పించి టాలెంట్ ను ప్రోత్సహించడంలో ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఎప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే తెలుగు ఇండియన్ ఐడల్ ద్వారా ఎంతో మంది సింగర్లను ప్రపంచానికి పరిచయం చేసింది. వీరిలో చాలా మంది సినిమాల్లో పాటలు పాడుతూ గాయనీ గాయకులుగా సత్తా చాటుతున్నారు.

Indian Idol Season 4: త్వరలోనే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4.. ఈ నెల 20న గ్రాండ్ లాంచ్
Telugu Indian Idol Season 4

Updated on: Aug 18, 2025 | 5:03 PM

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తెలుగు ఇండియన్ ఐడల్ తో అభిమానులను అలరిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, ప్రేమికుల నుంచి ప్రశంసలు పొందిన సింగింగ్ రియాలిటీ షో ‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్’. ఇప్పటికే రెండు సీజన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ రియాలిటీ షో మూడో సీజన్ కోసం రెడీ అవుతుంది. ఆహా తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 4 కోసం ఎదురు చూస్తోన్న అభిమానులకు గుడ్ న్యూస్. త్వరలోనే సీజన్ 4 మొదలు కానుంది.

Bigg Boss 9: అబ్బో.. పెద్ద ప్లానే..! బిగ్ బాస్ హౌస్‌లోకి ట్రెండింగ్ జంట.. ఇక రచ్చ రచ్చే

ఆహాలో సూపర్ హిట్ అయిన సింగింగ్ షో తెలుగు ఇండియన్ ఐడల్. ఎంతో టాలెంట్ ఉండి నిరూపించుకోవడానికి ఒక వేదిక కోసం ఎదురుచూసే యంగ్ సింగర్స్ కోసం ఈ షోను తీసుకువచ్చారు నిర్వాహకులు. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 4 రాబోతుంది. ఇందు కోసం గత కొన్ని రోజులుగా ఆన్ లైన్ లో ఆడిషన్స్ కూడా జరిగాయి. సింగింగ్ పై ఫ్యాషన్ ఉన్న సింగర్స్ ఈ ఆడిషన్స్ లో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ఇవి కూడా చదవండి

అప్పుడు నెలకు రూ.500.. ఇప్పుడు రూ. 83కోట్లకు మహారాణి.. 44 ఏళ్ల వయసులోనూ అదే హాట్‌నెస్

ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ కు తమన్, సింగర్ కార్తీక్, గీతా మాధురి జడ్జ్ లుగా ఉండనున్నారు. ఇక తెలుగు  ఇండియన్ ఐడల్ సీజన్ 4 లాంచింగ్  ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఆగస్టు 20న హైదరాబాద్ లో ఈ ఈవెంట్ జరగనుంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సింగర్ కార్తీక్, సింగర్ శ్రీరామ చంద్ర, సింగర్ సమీరా భరద్వాజ్, సింగర్ గీతామాధురి ఈ ఈవెంట్ లో పాల్గొననున్నారు. హైదరాబాద్ లో ఫైన్షియల్ డిస్ట్రిక్ లో రాత్రి 7 గంటలకు జరగనుంది.

చేసిన ఒకేఒక్క సినిమా రిలీజ్ కూడా కాలేదు.. కానీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా క్రేజీ బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us