ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బద్దలుకొట్టిన చిత్రం స్త్రీ 2. కేవలం రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ ఏకంగా రూ.750 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాదిలోనే హయ్యేస్ట్ కలెక్షన్స్ రాబట్టిన హిందీ సినిమాల్లో మొదటి స్థానంలో నిలిచింది. పెద్ద చిత్రాలతో పోటీ పడి మరీ అత్యధిక వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. థియేటర్లలో విడుదలై నాలుగు వారాలు దాటినా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలలో నటించగా.. పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు.
ఇన్నాళ్లు థియేటర్లలో అలరిస్తున్న ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. సెప్టెంబర్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. స్త్రీ 2 చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ పై త్వరలోనే అఫీషియల్ అనౌన్మెంట్ రానున్నట్లు సమాచారం. స్త్రీ 2 సినిమాను హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్విస్తూనే భయపెట్టిస్తుంది.
కథ విషయానికి వస్తే..
చందేరీ ఊరిలో మోడ్రన్ అమ్మాయిలు ఒక్కొక్కరిగా మిస్సవుతుంటారు. వారికి సర్ ఖటా అనే దయ్యం మాయం చేస్తుందని విక్కీ (రాజ్ కుమార్ రావు), బిట్టు, రుద్ర (పంకజ్ త్రిపాఠి) కనిపెడతారు. సర్ ఖటా బారి నుంచి ఊరి ప్రజలను కాపాడేందుకు స్త్రీ అనే దయ్యం సాయం కోరతారు. ఊరి నుంచి వెళ్లిపోయిన ఆ స్త్రీ దయ్యం మళ్లీ వచ్చిందా..? ఆ తర్వాత ఏం జరిగింది.. ? స్త్రీ కూతురికి విక్కీ ప్రియురాలికి (శ్రద్ధా కపూర్)కు ఉన్న సంబంధం ఏమిటీ ? అన్నదే కథ. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.