
ఓటీటీ లవర్స్ కు ఈ వీకెండ్ పండగే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాక్సాఫీస్ గా దగ్గర సూపర్ హిట్ గా నిలిచిన రెండు సూపర్ హిట్ సినిమాలు ఒకే రోజు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అవి కూడా సేమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘రాకాస’. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను బాగానే నవ్వించి భయపెట్టింది. అలాగే కలెక్షన్ల పరంగానూ నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. 15 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఓవరాల్ గా రూ. 27 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. లేడీ డైరెక్టర్ మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడీ మూవీ శుక్రవారం (మే 1) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అమెరికా నుంచి పెళ్లి కోసం సొంతూరికి వచ్చిన ఓ యువకుడు, అనుకోకుండా ఆ ఊరి కోటలో ఉన్న ‘బ్రహ్మ రాక్షసుడి’కి బలిగా వెళ్లాల్సి వస్తుంది. మరి ఆ తర్వాత ఏమైందన్నదే ఈ సినిమా కథ. హారర్ అంశాలకు తోడు వినోదం పుష్కలంగా ఉండటంతో ఓటీటీ లవర్స్ కు ఇది మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
ఇక యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించిన పక్కా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘బైకర్’. ఇండియాలోనే మొట్టమొదటి ‘మోటోక్రాస్ రేసింగ్’ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఈమూవీలో మరో కీలక పాత్ర పోషించారు. మాళవికా నాయర్ హీరోయిన్ గా నటించింది. కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ కూడా శుక్రవారం నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగు తో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
Narakam nundi sandesam ochindhi. Veerdu dhigadu 😎👻 pic.twitter.com/UXVOuLcqMw
— Netflix India South (@Netflix_INSouth) May 1, 2026
Gelavadam goppa kaadhu, chivaari dhaka poradatam goppa 🔥🏁 pic.twitter.com/ZNfp0WrKdD
— Netflix India South (@Netflix_INSouth) April 29, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.