Balagam OTT: ఈ రోజు రాత్రికే ఓటీటీలోకి బలగం.. ఎక్కడ చూడొచ్చంటే..?

జబర్ధస్త్ నటుడు వేణు డైరెక్షన్‌ దర్శకత్వంలో ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్ రామ్ జోడిగా నటించిన సినిమా లేటెస్ట్ డ్రామా ‘బలగం’. ఈ చిన్న సినిమా పెద్ద విజయం సాధించింది.

Balagam OTT: ఈ రోజు రాత్రికే ఓటీటీలోకి బలగం.. ఎక్కడ చూడొచ్చంటే..?
Balagam

Updated on: Mar 23, 2023 | 4:01 PM

తెలంగాణ మట్టి వాసనకు పల్లె గొంతకకు ప్రతీకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బలగం. ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. తొలి సినిమానే అయినా దర్శకుడు వేణు.. తెలంగాణ ప్రజల ఆత్మకు తెర రూపం ఇచ్చారన్న ప్రశంసలు దక్కుతున్నాయి. చిన్న సినిమాగా రిలీజైన బలగం రోజురోజుకూ ఆడియన్స్‌ బలగం పెంచుకుంటూ ముందుకు సాగింది.  ఒకప్పటి జబర్దస్త్‌ కమెడియన్ వేణు.. డైరెక్టర్‌గా మారి తీసిన మొదటి సినిమా బలగం..కథ బావుంది. కథనంలో కొత్తదనం ఉంది. దీంతో ఆడియెన్స్ ఆదరించారు. విమర్శకులు సైతం కాంప్లిమెంట్స్ ఇఛ్చారు.

కాగా థియేటర్లలో ఆకట్టుకున్న ఈ మూవీ తాజాగా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోతో పాటు, సింప్లీ సౌత్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లలో మార్చి 24 నుంచి స్రీమింగ్ అవ్వనుంది. ఫారెన్ కంట్రీస్‌లో ఉన్న ఇండియన్స్, అందునా తెలుగవారు సింప్లీ సౌత్‌లో ఈ ఫీల్ గుడ్ మూవీ చూడవచ్చు. ఈ చిత్రంలో  ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్‌, సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్‌ కీ రోల్స్ పోషించారు. తెలంగాణ పల్లె జీవనాన్ని, మనుషుల మధ్య బంధాలను చక్కగా చూపించారు దర్శకుడు వేణు.

ఈ సినిమా 20 రోజులు కంప్లీట్ అయ్యేసరికి 20.5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను వసూలు చేసి క్లీన్ హిట్‌గా నిలిచింది. బలగం సినిమా బడ్జెట్  2.2 కోట్ల లోపు మాత్రమే ఉండగా.. 20 రోజుల్లో ఏకంగా 20.5 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకుని.. నిర్మాత దిల్ రాజుకు కాసుల పంట పండించింది. తెలంగాణ కల్చర్‌కు ప్రాముఖ్యత ఇవ్వడంతో కేటీఆర్ దగ్గర్నుంచి రాష్ట్ర మంత్రులు, పలు ప్రజా ప్రతినిధులు సైతం సినిమాను ప్రమోట్ చేశారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us