OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎమ్‌డీబీలో 8.6 రేటింగ్.. తెలుగులోనూ ఉంది

కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ మలయాళం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అలాగే కంటెంట్ పరంగానూ విమర్శలు అందుకుంది. ఇప్పుడీ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎమ్‌డీబీలో 8.6 రేటింగ్.. తెలుగులోనూ ఉంది
OTT Movie

Updated on: Aug 13, 2026 | 6:34 PM

ఈ వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు రాబోతున్నాయి. రష్మిక మందన్నా కాక్ టెయిల్ 2, కంగనా రనౌత్ భారత భాగ్య విధాత, సునీల్ కాటాలన్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇలా సుమారు 20 కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేయనున్నాయి. అయితే వీటి కంటే ముందే గురువారం (ఆగస్టు 13) నుంచే ఒక సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇదొక సైబర్ థ్రిల్లర్ సినిమా. గత నెలలోనే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లును రాబట్టింది. అలాగే కంటెంట్ పరంగానూ విమర్శలు అందుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఒరిజినల్ మలయాళం వెర్షన్ తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ‘డిజిటల్ అరెస్ట్’, ఫేక్ కాల్స్, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్స్, ఓటీపీలు, లింక్స్ వంటి యథార్థ పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ సినిమా సాగుతుంది.

అచ్యుత అనే సాధారణ అమ్మాయి తన ఫ్యామిలీతో కలిసి గ్రామంలో ప్రశాంతంగా జీవిస్తుంటుంది. అయితే, అనూహ్యంగా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన సైబర్ క్రిమినల్స్ దాడిలో అచ్చుత కుటుంబం దాచుకున్న సొమ్మునంతటినీ కోల్పోతుంది. పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోరు. దీంతో స్వయంగా అచ్యుతనే రంగంలోకి దిగుతుంది. తన ఫ్యామిలీని రోడ్డున పడేసిన వారిని బుద్ధి చెప్పడానికి డిజిటల్ అండర్ వరల్డ్ లోకి అడుగుపెడుతుంది. ఆ తర్వాత ఏమైందన్నదే ఈ సినిమా స్టోరీ.

ఇవి కూడా చదవండి

హ్యాకింగ్, క్రైమ్ ఎలిమెంట్స్ అంశాల నేపథ్యంలో ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ సినిమా పేరు ‘అచ్యుత అవతారం’ (Achyuta Avataaram). పునీత్ ఆరాధ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా నందన్ టైటిల్ రోల్ (అచ్యుత) పోషించింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఓవర్సీస్ ఆడియెన్స్ కు మాత్రమే చూసే అవకాశం ఉంది. రేపటి నుంచి అందరికీ అందుబాటులో ఈ మూవీ ఉండే ఛాన్స్ ఉంది.

అచ్యుత అవతారం సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us