OTT Movie: వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్ సిరీస్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రియల్ స్టోరీ

ఎనిమిది ఎపిసోడ్‌ల ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు మూవీ లవర్స్ ను వణికిస్తోంది. ఈ సిరీస్‌లో చాలా భయానక దృశ్యాలు ఉన్నాయి. అలాగే ఊహించని ట్విస్టులు ఉన్నాయి. డిసెంబర్ 12న OTT ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసిన ఈ సిరీస్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

OTT Movie: వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్ సిరీస్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రియల్ స్టోరీ
Bhay Web Series

Updated on: Feb 21, 2026 | 10:01 AM

హారర్ థ్రిల్లర్.. ప్రజెంట్ మూవీ ట్రెండ్.. సినీ ప్రేమికులు ఎక్కువగా ఈ జానర్ సినిమాలనే చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీలో ప్రతి వారం సరికొత్త హారర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఆడియెన్స్ ను భయపెడుతున్నాయి. అలాంటి ఎనిమిది ఎపిసోడ్‌ల హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు OTTని షేక్ చేస్తోంది. దెయ్యాలు, మంత్రగత్తెలు, క్షుద్ర పూజల నేపథ్యంలో సాగే ఈ సిరీస్ చాలా భయానకంగా ఉంటోంది. మనం మాట్లాడుతున్న హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ విడుదలై పది రోజులకు పైగా అయింది, కానీ ఇది ఇప్పటికీ OTT ప్లాట్‌ఫామ్‌లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. హయ్యోస్ట్ వ్యూస్ వచ్చిన వెబ్ సిరీసుల్లో ఒకటిగా నిలిచింది. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే..గౌరవ్ తివారీ అనే ఓ కమర్షియల్ పైలట్ చుట్టూ తిరుగుతుంది. అతను మొదట దెయ్యాలను నమ్మడు. కానీ విమానంలో అనుకోకుండా ఒక సంఘటన జరిగినప్పుడు, అతను పునరాలోచనలో పడతాడు.ఆ తర్వాత, అతను పైలట్‌గా తన ఉద్యోగాన్ని వదులుకుని, వేరే ప్రపంచం వైపు అడుగులు వేస్తాడు. దయ్యాలు, ఆత్మలు అంటూ ‘పారానార్మల్ ఇన్వెస్టిగేటర్’గా ఎలా మారిపోతాడు? ఇదే క్రమంలో కేవలం 32 ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పోతాడు. మరి గౌరవ్ మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటి? నిజంగానే దయ్యాలు, ఆత్మలు ఉన్నాయా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘భయ్’. ప్రముఖ నటుడు కరణ్ థక్కర్ గౌరవ్ తివారీ పాత్రలో నటించారు. 2016లో ఢిల్లీలోని తన సొంత ఇంట్లోనే గౌరవ్ తివారీ అనుమానాస్పద స్థితిలో కన్నుమూస్తాడు. ఈ ఘటన ఆధారంగాన ‘భయ్: ది గౌరవ్ తివారీ మిస్టరీ’ వెబ్ సిరీస్ తెరకెక్కింది. డిసెంబర్ 12న OTT ప్లాట్‌ఫామ్ అమెజాన్ MX ప్లేయర్‌లో ఈ సిరీస్ విడుదలైంది. అప్పటి నుండి, ఈ సిరీస్ OTTలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అంతేకాదు IMDBలో పదికి 8.4 రేటింగ్‌ను సాధించింది. హారర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూడాలనుకునేవారికి ఈ సిరీస్‌ను వాచ్ లిస్ట్‌లో చేర్చుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us