
టాలెంటెడ్ సుధీర్ బాబు ప్రధాన పాత్రలో పలాస 1978 ఫేమ్ కరుణకుమార్ రూపొందించిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఇందులో ఆనంది హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక మొదటి సినిమా పలాస 1978తో సినీ ప్రముఖులు ప్రశంసలు అందుకున్నాడు కరుణకుమార్ సమాజంలోని కుల వ్యవస్థ దాని వలన అణగారిన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఈ క్రమంలో జరిగే తిరుగుబాటు వంటి అంశాలతో సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు కరుణకుమార్. తాజాగా విడుదలైన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకోవడంతో కరుణకుమార్ తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడంటూ ఇప్పటి నుంచే ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్స్.
ఈ క్రమంలోనే కరుణకుమార్ తదుపరి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు ఫిల్మ్ వర్గా్ల్లో వినిపిస్తోంది. కరుణ కుమార్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం ఓ మెగా వెబ్ సిరీస్ తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని.. దాదాపు 20 ఎపిసోడ్స్ ఉండేలా ఈ వెబ్ సిరీస్ రూపొందించబోతున్నట్లుగా సమాచారం. నిజాంగానే 20 ఎపిసోడ్స్ ఉండే తెలుగులో అతిపెద్ద వెబ్ సిరీస్ ఇదే అవుతుంది. కరుణ కుమార్ ఇంతకు ముందు మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ తెరకెక్కించాడు. ఆహాలో స్ట్రీమంగ్ అయిన ఈ సిరీస్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ కోసం మెగా వెబ్ సిరీస్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: Bandla Ganesh: మీరు బుక్ చేసుకొండి.. నేను పర్మిషన్ ఇస్తా.. ఆసక్తికర ట్వీట్ చేసిన బండ్ల గణేష్..
Ariyana: అరియానా న్యూలుక్ చూసి కంగుతిన్న నెటిజన్స్.. అలా చూడలేమంటూ కామెంట్స్..
Love Story: అభిమానులకు మళ్లీ షాకిచ్చిన నాగచైతన్య.. లవ్ స్టోరీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లే..
Ichata Vahanamulu Nilupa Radu Review: ఇచ్చట వాహనములు నిలుపరాదు… ఒకవేళ నిలిపితే జరిగేది ఇదే!