Bigg Boss Winner Bindu Madhavi: బిగ్‏బాస్ విజేతగా నిలిచిన బిందుమాధవి.. టైటిల్ గెలిచిన తొలి అమ్మాయిగా హిస్టరీ..

|

May 22, 2022 | 6:47 AM

ప్రతి టాస్కులలోనూ.. సందర్భంలోనూ ఎదుటివారికి గట్టి పోటీనిస్తూ చివరకు ధైర్యంగా పోరాడింది. (Bindu Madhavi) కంటెస్టెంట్ అఖిల్ నుంచి

Bigg Boss Winner Bindu Madhavi: బిగ్‏బాస్ విజేతగా నిలిచిన బిందుమాధవి.. టైటిల్ గెలిచిన తొలి అమ్మాయిగా హిస్టరీ..
Bindu Madavi
Follow us on

బిగ్‏బాస్ చరిత్రలోనే తొలిసారిగా మహిళ విజేతగా నిలిచింది. బుల్లితెరపై ఐదు సీజన్లు పూర్తిచేసుకున్న బిగ్‏బాస్ ఇప్పుడు ఓటీటీ వేదికగా నాన్ స్టాప్ అంటూ స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. (Bigg Boss ) తాజాగా ఈ రియాల్టీ గేమ్ షో శనివారం గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. మొదటి నుంచి గట్టి పోటీనిస్తూ.. ఆడపులిగా పేరు తెచ్చుకున్న తెలుగమ్మాయి బిందుమాధవి.. బిగ్‏బాస్ టైటిల్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ప్రతి టాస్కులలోనూ.. సందర్భంలోనూ ఎదుటివారికి గట్టి పోటీనిస్తూ చివరకు ధైర్యంగా పోరాడింది. (Bindu Madhavi) కంటెస్టెంట్ అఖిల్ నుంచి తీవ్ర స్తాయిలో పోటి వచ్చినా.. తన మాటతీరుతో.. బుద్దిబలంతో బిగ్‏బాస్ టైటిల్ గెలిచి.. రూ. 40 లక్షలు సొంతం చేసుకున్నారు. తన మాట తీరు.. ఆట తీరుతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకోవడమే కాకుండా.. బిగ్‏బాస్ చరిత్రలోనే తొలిసారి మహిళ విన్నర్‏గా నిలిచింది బిందు. ఇక బిగ్‏బాస్ టైటిల్ గెలివాలని పోరాడిన అఖిల్ ఆశలు మరోసారి ఆవిరైపోయాయి..ఈసారి కూడా బిగ్‏బాస్ నాన్ స్టాప్ రన్నరప్‏గా నిలిచాడు.

చివరకు 7 కంటెస్టెంట్స్ మిగిలగా.. బిందుమాధవి మొదటి స్థానంలో.. అఖిల్ రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.. అనిల్ రాథోడ్, మిత్రాశర్మ ముందుగానే ఎలిమినేట్ కాగా.. అనంతరం బాబా భాస్కర్ ఎలిమినేట్ అయ్యారు. అనంతరం అరియానా రూ. 10 లక్షలు తీసుకుని బయటకు వచ్చేసింది. ఇక ఆ తర్వాత యాంకర్ శివ ఎలిమినేట్ అయిన తర్వాత బిందుమాధవి, అఖిల్ ఇద్దరూ బిగ్‏బాస్ స్టేజ్ పైకీ చేరుకున్నారు. అనంతరం బిగ్‏బాస్ ఇంట్లో వారి అనుభవాలు.. ఈ షోకు రావడానికి గల కారణాలను చెప్పమని నాగార్జున అడగ్గా.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు… తెలుగు సినిమాల్లో మళ్లీ నటించేందుకు బిగ్‏బాస్ షోకు వచ్చినట్లు తెలిపింది బిందుమాధవి.

ఇవి కూడా చదవండి

తనను ఆదరించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు బిందు. బిగ్‏బాస్ ట్రోఫీ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని.. ట్రోఫీ గెలవడం కోసం ఏలాంటి అడ్డదారులు తొక్కలేదని.. జెన్యూన్ గా గేమ్ ఆడినట్లు చెప్పుకొచ్చింది . తాను గెలుచుకున్న బిగ్‏బాస్ టైటిల్ ను లేట్ బ్లూమర్స్ కు అంకితం చేస్తున్నట్లు తెలిపింది. తన జీవితంలో అన్ని చాలా ఆలస్యంగా అందుకునేదాన్ని.. సక్సెస్ కూడా చాలా ఆలస్యంగా రుచి చూసినట్లు తెలిపింది.