
అక్కినేని నాగార్జున (akkineni nagarjuna).. నాగచైతన్య (naga chaitanya) కలిసి నటించిన లేటేస్ట్ చిత్రం బంగార్రాజు (naga chaitanya). డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్గా నిలిచింది. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించగా.. చైతూ సరసన కృతి శెట్టి నటించింది. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్న నాయనా చిత్రానికి సిక్వెల్గా బంగార్రాజు సినిమా తెరకెక్కింది. ఓవైపు కరోనా కేసులు పెరుగుతుండడంతో భారీ చిత్రాలు సైతం వాయిదా పడుతున్న తరుణంలో తమ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసేది లేదని తేల్చి చెప్పి మరీ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు కింగ్ నాగార్జున.
తాజాగా సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. బంగార్రాజు ట్రైలర్ రిలీజ్ చేశారు జీ5 మేకర్స్. లవ్.. యాక్షన్.. ఎమోషన్.. సస్పెన్స్ ఇలా కథను అన్ని వైపులా నుంచి కవర్ చేస్తూ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నుంచి కూడా మంచి వసూళ్లు రాబట్టింది.
Also Read: Samantha: మధ్యలో చిన్న చిన్న క్షణాలు.. ఇంతకీ ఫోటోతో సమంత ఏం చెప్పాలనుకుంటుంది..
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమో.. మహేష్ కళావతి సాంగ్ అదుర్స్..