OTT Movie: ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ సినిమా.. ఇంటిల్లిపాది నవ్వుకోవచ్చు.. తెలుగులోనూ చూడొచ్చు

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి ఆర్కే రోజా గత కొన్నేళ్లుగా సినిమాలు చేయడం లేదు. రాజకీయాల్లో బిజీ కావడంతో కేవలం జబర్దస్త్ లాంటి టీవీ షోలకు మాత్రమే ఆమె పరిమితమయ్యారు. అయితే ఇటీవల ఓ తమిళ సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చారామె.

OTT Movie: ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ సినిమా.. ఇంటిల్లిపాది నవ్వుకోవచ్చు.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie

Updated on: Aug 11, 2026 | 6:36 PM

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగుతో సహా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారామె. అన్ని భాషల్లో కలిసి 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారామె. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ సత్తా చాటారు రోజా. నగరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పర్యాటకం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా సేవలందించారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లో బిజీ కావడంతో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. జబర్దస్త్ వంటి షోలను కూడా వదిలేశారు. చివరిగా ఆమె 2013లో పవిత్ర అనే తెలుగు సినిమాలో కనిపించారు. అయితే ఇప్పుడీ సీనియర్ హీరోయిన మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే బుల్లితెరపై పలు టీవీ ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తున్నారు రోజా. ఇక సిల్వర్ స్క్రీన్ పై రోజా రీఎంట్రీ ఇచ్చిన సినిమా ‘అన్బే డయానా’. ఇది ఒక తమిళ సినిమా. జులైలో థియేటర్లలో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఈ మూవీ కేవలం తమిళంలో మాత్రమే రిలీజైంది. తెలుగులో విడుదల కాలేదు. అయితే ఇప్పుడీ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి రానుంది.

‘అన్బే డయానా’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 28 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు.తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ మూవీని స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ చిత్రానికి పారి ఎలావళగన్ కథ, కథనం, దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా నటించడం విశేషం. ఆయన సరసన రమ్య రంగనాథన్ హీరోయిన్ గా ఆకట్టుకుంది. వీరితో పాటు రోజా సెల్వమణి, చేతన్ కదంబి, పరితాబంగల్ గోపి, సెల్ మురుగన్, నిఖిలా శంకర్, ఇస్మత్ బాను, సుదర్శన్ గాంధీ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

సోనీ లివ్ లో రోజా రీఎంట్రీ సినిమా..

అన్బే డయానా సినిమాలో నటి రోజా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us